ముంబైలో 50% మంది పిల్లల్లో కరోనా యాంటీబాడీలు

ముంబైలో 50% మంది పిల్లల్లో కరోనా యాంటీబాడీలు

ముంబైలో దాదాపు 50 శాతం మంది పిల్లల్లో కరోనా యాంటీబాడీలు ఉన్నట్లు సీరో సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. బృహత్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌(BMC) పరిధిలో కొన్ని ప్రాంతాల్లో బీవైఎల్‌ నాయర్‌ ఆస్పత్రి,కస్తూర్బా మాలిక్యులార్‌ డయోగ్నోస్టిక్‌ ల్యాబ్‌  కలిసి సర్వే నిర్వహించాయి. ఈ స్థాయిలో సీరో పాజిటివిటీ క్రమంలో మూడో వేవ్ ముప్పుపై ఉన్న ఆందోళనల నుంచి కాస్త ఉపశమనం లభిస్తోంది. ఇప్పటికే 50 శాతం మందిలో యాంటీబాడీలు ఉన్నకారణంగా మూడో వేవ్‌ విజృంభించే అవకాశాలు తక్కువేనని అధికారులు భావిస్తున్నారు.

ముంబైలో మొత్తం 24 వార్డుల్లో సర్వే చేశారు. ఆరు నుంచి 18 ఏళ్ల మధ్య వయసుగల పిల్లల్లో మొత్తం 10 వేల నమూనాలను సేకరించారు. ఈ వర్గంలో మొత్తం 51.18 శాతం సీరో పాజిటివిటీ ఉన్నట్లు గుర్తించారు. అత్యధికంగా 10-14 ఏళ్ల మధ్య వయసుగల వారిలో  53.43 శాతం సీరో పాజిటివిటీ ఉన్నట్లు కనుగొన్నారు. ఇక 1-4 ఏళ్ల వారిలో 51.04 శాతం, 5-9 ఏళ్ల వారిలో 47.33 శాతం, 10-14 ఏళ్ల వారిలో 53.43 శాతం, 15-18 ఏళ్ల వారిలో 51.39 శాతం సీరో పాజిటివిటీ  ఉన్నట్లు BMC ప్రకటించింది.

మార్చిలో నిర్వహించిన సర్వేతో పోలిస్తే ప్రస్తుతం పిల్లల్లో సీరో పాజిటివిటీ పెరిగినట్లు తెలిపింది.