ఓరి నాయనో : ఎండా కాలంలో కూల్ డ్రింక్స్ ను.. మంచినీళ్లలా తాగేశారు

ఓరి నాయనో : ఎండా కాలంలో కూల్ డ్రింక్స్ ను.. మంచినీళ్లలా తాగేశారు

ఎండాకాలం అంటేనే హీట్.. ఉప శమనం కోసం మజ్జిగో.. ఫ్రూట్ జ్యూసులో.. కొబ్బరి బోండాలో తాగలేదు జనం.. ఈ ఎండాకాలంలో కూల్ డ్రింక్స్ ఎడాపెడా తాగేశారు.. ఎంతలా అంటే 50 శాతంపైనే కుటుంబాలు.. ఎండ వేడి నుంచి తట్టుకోవటం కోసం కూల్ డ్రింక్స్ తాగేశారంట.. మంచినీళ్ల కంటే ఎక్కువే కూల్ డ్రింగ్స్ తాగేసినట్లు చెబుతున్నాయి నివేదికలు.. గత రెండేళ్లతో పోల్చుకుంటే ఇది 19 శాతం అధికం అంట.. ఈ క్రమంలోనే కూల్ డ్రింగ్స్ కంపెనీ సేల్స్ ఏకంగా 41 శాతం పెరిగినట్లు బిజినెస్ వర్గాలు చెబుతున్నాయి.

గత రెండేళ్లలో 250ml పెట్ బాటిల్స్ సాఫ్ట్ డ్రింక్స్ సేల్స్ పెరిగాయని తెలుస్తోంది.ఈ ఏడాది కూడా ఇదే రేంజ్ లో వీటి వినియోగం ఉండనున్నట్లు అంచనా వేస్తున్నారు ట్రేడ్ నిపుణులు. ప్రతి 56గంటల్లో ఒక fmcg ప్రాడక్ట్ ని ఆన్లైన్ లేదా ఆఫ్ లైన్ ద్వారా కొంటున్నట్లు నివేదికలో తేలింది. ఏడాదిలో సగటున ఒక్కో కస్టమర్ 156 fmcg ప్రాడక్ట్స్ ని కొంటున్నట్లు తేలింది. వీటితో పాటు వాషింగ్ లిక్విడ్స్ వినియోగం భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. 2024 సంవత్సరానికి గాను వీటి వినియోగం 1000టన్నుల మార్క్ చేరుకోవటం రికార్డ్ అని అంటున్నారు.