పంజ్‌షీర్‌‌లో బీకర పోరు.. 600 మంది తాలిబాన్లు హతం

పంజ్‌షీర్‌‌లో బీకర పోరు.. 600 మంది తాలిబాన్లు హతం

అఫ్గానిస్థాన్‌పై తాలిబాన్లు ఆధిపత్యం సాధించినప్పటికీ ఒక్క పంజ్‌షీర్‌‌ ప్రావిన్స్ మాత్రం వాళ్లకు కొరకొరాని కొయ్యగా మారింది. తమ బొందిలో ప్రాణం ఉండగా తాలిబాన్లకు లొంగేది లేదని పంజ్‌షీర్‌‌ నార్తర్న్‌ రెసిస్టెన్స్‌ ఫోర్సెస్‌ పంతం పట్టి చెబుతున్నాయి. దీంతో ఎలాగైనా పంజ్‌షీర్‌‌ను తమ వంశం చేసుకోవాలని తాలిబాన్లు ఆయుధాలతో అటాక్‌కు దిగారు. ఈ క్రమంలో కొద్ది రోజులుగా పంజ్‌షీర్‌‌లో బీకర పోరు సాగుతోంది. 

పంజ్‌షీర్‌ లోయను స్వాధీనం చేసుకోవడానికి తాలిబాన్లు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అయితే వారిని రెబల్స్ ప్రతిఘటిస్తున్నారు. పంజ్‌షీర్‌లోని వివిధ జిల్లాలో 600 మందికి పైగా తాలిబాన్లను మట్టుబెట్టినట్టు రెసిస్టెన్స్ ఫోర్స్ ప్రకటించింది. మరో వెయ్యి మంది తాలిబాన్లు లొంగిపోయారని రెబల్స్ ప్రతినిధి ఫాహిమ్ దష్తీ ట్వీట్ చేశారు. పంజ్‌షీర్‌ను స్వాధీనం చేసుకోవడానికి తాలిబాన్లు సమస్యలు ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది. ఇతర ప్రాంతాల నుంచి పంజ్‌షీర్‌కు చేరుకోవడానికి వారు కష్టపడ్తున్నట్టు సమాచారం. మరోవైపు లాండ్ మైన్లతో రెబల్స్ తాలిబాన్లను అడ్డుకుంటున్నారు. అయితే పంజ్‌షీర్‌లో తమ పోరాటం కొనసాగుతోందన్నారు తాలిబన్లు. నిన్న పంజ్‌షీర్‌ను స్వాధీనం చేసుకున్నామని ఆఫ్గనిస్థాన్‌లో తాలిబాన్లు సంబరాలు చేసుకున్నారు. కానీ.. తాలిబాన్ల సంబరాలు కొనసాగుతుండగానే తాము 600 మందిని చంపేశామని రెసిస్టెన్స్ ఫోర్స్ ప్రకటించింది.