బెంగాల్లో ఫ్రంట్ లైన్ వారియర్స్పై కరోనా పంజా

బెంగాల్లో ఫ్రంట్ లైన్ వారియర్స్పై కరోనా పంజా

కోల్కతా : బెంగాల్లో కరోనా విజృంభిస్తోంది. రోజు రోజుకూ కొత్త కేసుల సంఖ్య పెరుగుతోంది. బెంగాల్ లో ఇవాళ కొత్తగా 9,073మంది మహమ్మారి బారినపడ్డారు. 16మంది మృతి చెందారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 25,474 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఫ్రంట్ లైన్ వారియర్స్ ఎక్కువ మంది కరోనా బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. 
కోల్కతా 83 మంది పోలీసులు కోవిడ్ బారినపడ్డారు. వీరిలో చాలా మంది ఐపీఎస్ స్థాయి అధికారులు ఉన్నారు. కరోనా బారినపడ్డ 83 మందిలో 47 మంది హోం ఐసోలేషన్ లో ఉండగా.. 16మంది హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే కోల్కతాలో అతిపెద్ద గవర్నమెంట్ హాస్పిటల్ అయిన కోల్ కతా మెడికల్ కాలేజ్కు చెందిన డాక్టర్లు, సిబ్బంది కోవిడ్ బారిన పడ్డారు. హాస్పిటల్ కు చెందిన దాదాపు 100 మందికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది. నార్త్ బెంగాల్ మెడికల్ కాలేజీలో సైతం కరోనా కలకలం సృష్టించి డాక్టర్లు, నర్సులు ఇతర సిబ్బందితో కలిపి 25 మందికి కరోనా సోకింది. వారందరనీ ఐసోలేషన్ లో ఉంచి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. 
సోమవారం సైతం కలకత్తా మెడికల్ కాలేజీ హాస్పిటల్ కు చెందిన 70మంది డాక్టర్లు, చిత్తరంజన్ సేవా సదన్, శిశు సదన్ ఆస్పత్రికి చెందిన 24 మంది వైద్య సిబ్బంది, రీజినల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఆప్తల్మాలజీకి చెందిన 12 మందికి కరోనా సోకింది. వారందరినీ క్వారంటైన్కు తరలించారు. 

మరిన్ని వార్తల కోసం..

కరోనా కొత్త వేరియంట్ కలకలం

కరోనా పంజా.. ముంబైలో ఒక్కరోజే 10,860 కేసులు