‘ఆర్ఆర్ఆర్’ ఓ క్లాసిక్.. ఓవర్సీస్ సెన్సార్ రివ్యూ

‘ఆర్ఆర్ఆర్’ ఓ క్లాసిక్.. ఓవర్సీస్  సెన్సార్ రివ్యూ

అబుదాబి: భారతీయ సినీ ప్రేక్షకులతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ భారీ మూవీ మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. భారత్ లో కంటే ముందుగానే 24వ తేదీన యూఎస్ తోపాటు పలు వరల్డ్ వైడ్ గా పలు దేశాల్లో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఓవర్సీస్ సెన్సార్ బోర్డు సభ్యుడు ఉమైర్ సంధూ ‘ఆర్ఆర్ఆర్’ గురించి చేసిన ఓ పోస్టు వైరల్ గా మారింది. రీసెంట్ గా ఓవర్సీస్ లో ఈ చిత్ర సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. దీంతో ఈ సినిమా గురించి ఉమైర్ స్పందిస్తూ.. ఆర్ఆర్ఆర్ అందరూ గర్వపడేలా ఉంటుందన్నారు. 

‘ఆర్ఆర్ఆర్ అందర్నీ గర్వపడేలా చేస్తుంది. ఓ భారతీయ దర్శకుడు ఎంతో ధైర్యంతో ఈ చిత్రాన్ని ఇంత భారీస్థాయిలో అందరూ మెచ్చేలా తీయడం నిజంగా గర్వకారణం. ఈ మూవీని మిస్సవ్వొద్దు. దీన్ని ఇవాళ బ్లాక్ బస్టర్ అనొచ్చు. కానీ ఇదో క్లాసిక్ మూవీలా నిలిచిపోతుంది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తమ కెరీర్ లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఎన్టీఆర్, చరణ్ తమ నటనతో అద్భుతమే చేశారు. ఇదో డెడ్లీ కాంబినేషన్. ఇక అజయ్ దేవగణ్ పాత్ర మిమ్మల్ని తప్పకుండా ఆశ్చర్యపరుస్తుంది’ అని ఉమైర్ సంధూ ఇన్ స్టాగ్రామ్ లో పోస్టులో పేర్కొన్నారు. ఇద్దరు హీరోలను కలిపి ఈరోజుల్లో సినిమా తీయడం కష్టమని.. కానీ రాజమౌళి దీన్ని సుసాధ్యం చేశారన్నారు. 

మరిన్ని వార్తల కోసం:

రాఖీభాయ్ ‘తూఫాన్’ షురూ

పగలు మెక్డొనాల్డ్స్ జాబ్.. రాత్రి రన్నింగ్ ప్రాక్టీస్

జూనియర్ ఎన్టీఆర్ కారుకు బ్లాక్ ఫిలిం తొలగింపు