సొంతింటి కల నెరవేర్చినందుకు ధన్యవాదాలు : మోదీకి ఎమోషనల్ లెటర్

సొంతింటి కల నెరవేర్చినందుకు ధన్యవాదాలు : మోదీకి ఎమోషనల్ లెటర్

ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ ద్వారా ఓ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. తాను ఇటీవల అందుకున్న ఓ లేఖలను షేర్ చేస్తూ... తన అభిప్రాయాన్ని కూడా వెల్లడించారు. 'జహాన్ ఝుగ్గీ వహీ మకాన్' పథకం కింద పక్కా గృహాలు పొందిన ఢిల్లీలోని కల్కాజీకి చెందిన తల్లులు, సోదరీమణుల నుంచి లేఖలు అందుకున్నందుకు చాలా ఉప్పొంగిపోయాను" అని ప్రధానమంత్రి తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

"విదేశాంగ మంత్రి జైశంకర్ అక్కడికి వెళ్లినప్పుడు, మహిళలు ఈ లేఖలను ఆయనకు అందజేశారు, అందులో వారు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ పథకం ద్వారా తమ ఏళ్ల కల ఎలా నెరవేరిందో, అది ఎలా సులభతరమైందో వారు లేఖలో చెప్పారు. లేఖలు పంపినందుకు మీ అందరికీ ధన్యవాదాలు! మా ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం అదే నిబద్ధతతో పని చేస్తూనే ఉంటుంది" అని ప్రధాని తన ట్వీట్‌లో రాసుకువచ్చారు.