సూర్యాపేట, వెలుగు : మూడేండ్లుగా అద్దె చెల్లించడం లేదంటూ స్కూల్ బిల్డింగ్ ఓనర్ సోమవారం గేటుకు తాళం వేశారు. వివరాల్లోకి వెళ్తే... సూర్యాపేట పట్టణంలోని తిలక్‌నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఓ అద్దె భవనంలో కొనసాగుతోంది. మూడేండ్ల కిరాయి పెండింగ్‌లో ఉండడంతో భవన యజమాని సోమవారం స్కూల్ గేటుకు తాళం వేశారు.
ఉదయమే వచ్చిన స్టూడెంట్లు, టీచర్లు.. గేట్‌కు తాళం ఉండడంతో బయటే వేచి ఉన్నారు. విషయం తెలుసుకున్న ఆఫీసర్లు స్టూడెంట్లను సమీపంలోని హైస్కూల్‌కు తరలించారు. బకాయిల సమస్యను త్వరగా పరిష్కరించి స్కూల్ నిర్వహణకు చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరారు.
