ఆక్స్​ఫర్డ్​ వ్యాక్సిన్​ ఫైనల్​ ట్రయల్స్​

ఆక్స్​ఫర్డ్​ వ్యాక్సిన్​ ఫైనల్​ ట్రయల్స్​

న్యూఢిల్లీ:దేశంతో పాటు ప్రపంచంలో కరోనా కేసులు రోజురోజుకూ ఎక్కువైపోతున్నాయి. ఇప్పటిదాకా దానికి సరైన ట్రీట్​మెంట్​ అంటూ ఏమీ లేదు. దాని వల్ల వచ్చే లక్షణాలను కంట్రోల్​ చేస్తూ వైరస్​ను కట్టడి చేస్తున్నారు డాక్టర్లు. వివిధ మందుల కాంబినేషన్​తో ఒంట్లోని వైరస్​ లోడ్​ను తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ మధ్య కాలంలో కొన్ని మందులూ మార్కెట్​లోకి వస్తున్నాయి. ఇటు వ్యాక్సిన్లపైనా రీసెర్చ్​లు, ట్రయల్స్​ జోరుగా సాగుతున్నాయి. అందులో ముందు వరుసలో ఉంది ఆక్స్​ఫర్డ్​ వ్యాక్సిన్​ చేడాక్స్​1ఎన్​కొవ్​19. ఆ వ్యాక్సిన్​ ఇప్పుడు ఫైనల్​ ట్రయల్స్​ దశలోకి ఎంటరైపోయింది. ఫైనల్​ ట్రయల్స్​లోకి ఎంటరైన ఫస్ట్​ వ్యాక్సిన్​గా క్రెడిట్​ కొట్టేసింది. బ్రిటన్​కు చెందిన ఆస్ట్రాజెనికాతో పాటు మన దేశానికి చెందిన సీరమ్​ ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ ఇండియా ఆ వ్యాక్సిన్​ తయారీకి ఒప్పందం చేసుకున్నాయి.

13 వ్యాక్సిన్లు క్లినికల్​ ట్రయల్స్​ దశలో

ఆక్స్​ఫర్డ్​ వ్యాక్సిన్​ ఒక్కటే కాదు.. డబ్ల్యూహెచ్​వో లెక్కల ప్రకారం మరో 13 వ్యాక్సిన్​ క్యాండిడేట్లు ఇప్పుడు క్లినికల్​ ట్రయల్స్​ దశలో ఉన్నాయి. ఇంకో 129 వ్యాక్సిన్​ క్యాండిడేట్లు ప్రిక్లినికల్​ ట్రయల్స్​ దశలో ఉన్నాయి. మామూలుగా అయితే ఒక వ్యాక్సిన్​ ప్రి క్లినికల్​ ట్రయల్స్​ దశ నుంచి క్లినికల్​ ట్రయల్స్​ దశకు రావాలంటే సగటున 10.71 సంవత్సరాలు పడుతుందని సైంటిస్టులు అంటున్నారు. అందులో సక్సెస్​ అయ్యేది కూడా కేవలం 6 శాతమేనంటున్నారు. ఇప్పుడు కరోనా వ్యాక్సిన్​ విషయానికి వస్తే మాత్రం దాదాపు అన్ని సంస్థలు దానిపై సీరియస్​గా పనిచేస్తున్నాయి. దాంతోపాటు వీలైనంత తొందరగా జనానికి అందుబాటులోకి తేవాలన్న ఉద్దేశంతో వేగంగా ముందుకుపోతున్నాయి. ఆక్స్​ఫర్డ్​ యూనివర్సిటీ వ్యాక్సిన్​తో పాటు అమెరికాకు చెందిన మోడెర్నా అనే సంస్థ కూడా ఇంకో వ్యాక్సిన్​ను తయారు చేస్తోంది. అది కూడా వచ్చే నెలలో ఫైనల్​ ఫేజ్​ ట్రయల్స్​లోకి ఎంటరవుతుంది. ఇటు చైనాకు చెందిన సినోవాక్​ బయోటెక్​ వ్యాక్సిన్​దీ అదే రూటు. యూఏఈలో ఫేజ్​ 3 ట్రయల్స్​ చేసేందుకు చైనా నేషనల్​ బయోటెక్​ గ్రూప్​ కంపెనీకి యూఏఈ గవర్నమెంట్​ పర్మిషన్​ ఇచ్చింది.

నాలుగు క్యాండిడేట్లు.. ఐదు కంపెనీలు

మన దేశమూ వ్యాక్సిన్​ తయారీకి తనవంతు సాయం చేస్తోంది. నాలుగు వ్యాక్సిన్​ క్యాండిడేట్లపై మన దేశానికి చెందిన 5 కంపెనీలు పనిచేస్తున్నాయి. వ్యాక్సిన్ల ప్రభావం, టాక్సిసిటీ (విష ప్రభావం)ని తెలుసుకునేందుకు ప్రిక్లినికల్​ ట్రయల్స్​ చేస్తున్నాయి. ఇనాక్టివ్​ హోల్​ వైరస్​ వ్యాక్సిన్​ తయారీకి అమెరికాకు చెందిన రెఫానా ఐఎన్​సీ అనే కంపెనీతో ఢిల్లీకి చెందిన పనాసీ బయోటెక్​ జట్టు కట్టింది. రెండు వేర్వేరు ప్లాట్​ఫాంలతో మూడు వ్యాక్సిన్​ క్యాండిడేట్లపై హైదరాబాద్​కు చెందిన భారత్​ బయోటెక్​ పనిచేస్తోంది. అందులో నాసల్​ ఫ్లూ వ్యాక్సిన్​ క్యాండిడేట్​ కూడా ఒకటి. మన హైదరాబాద్​కే చెందిన ఇండియా ఇమ్యునోలాజికల్స్​ అనే కంపెనీ అహ్మదాబాద్​కు చెందిన జైడస్​ క్యాడిలతో ఒప్పందం చేసుకుంది. ఆక్స్​ఫర్డ్​ వ్యాక్సిన్​పై సీరమ్​ ఇనిస్టిట్యూట్​ పనిచేస్తున్న విషయం తెలిసిందే. అందుకు ఆస్ట్రాజెనికా, అమెరికాకుచెందిన కోడాజెనిక్స్​, ఆస్ట్రియాకు చెందిన థెమిస్​ బయోసైన్స్​తో సీరమ్​ జట్టు కట్టింది.

డేంజరూ ఉంది…

ఇంత వేగంగా వ్యాక్సిన్​ను డెవలప్​ చేయడమన్నది అసాధ్యమన్నది కొందరు నిపుణుల మాట. దాని వల్ల డేంజర్​ పొంచి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. సరైన సేఫ్టీ చెక్స్​ లేకుండా వ్యాక్సిన్​ను మార్కెట్​లోకి తీసుకొస్తే లాభాల కన్నా నష్టాలే ఎక్కువగా ఉంటాయని వాదిస్తున్నారు. ఉన్న వైరస్​ పోవడం అటుంచి వ్యాక్సిన్​ వల్లే ఒంట్లో వైరస్​ తిష్ట వేసే ముప్పు ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇంతకుముందు అలాంటి సంఘటనలూ జరిగాయంటున్నారు. ‘‘ఫిలిప్పీన్స్​లో డెంగ్యూ వ్యాక్సిన్​ డెంగ్​వ్యాక్సియా ఎంతటి వివాదం రేపిందో మరిచిపోకూడదు. అక్కడి స్కూళ్లలో సనోఫీ పాశ్చర్​ డెంగ్​వ్యాక్సియాను పిల్లలకు ఇచ్చారు. అయితే, ఆ వ్యాక్సినేషన్​ వల్ల చాలా మంది పిల్లలు చనిపోయారు. దీంతో ఆ ప్రోగ్రామ్​ను ఫిలిప్పీన్స్​ రద్దు చేసింది. ఆ తర్వాతే వ్యాక్సిన్​తో డెంగ్యూ వచ్చే ముప్పు కూడా ఉందని కంపెనీ ప్రకటించింది. ఈ విషయాన్ని ఎవరూ మరువొద్దు’’ అని ఐసీఎంఆర్​ మాజీ డైరెక్టర్​ డాక్టర్​ ఎన్​కే గంగూలీ అన్నారు.

10 వేల మందిపై ట్రయల్స్​

ఫైనల్​ స్టేజ్​ ట్రయల్స్​లో భాగంగా బ్రిటన్​లో 10,260 మంది పెద్దలు, పిల్లలపై వ్యాక్సిన్​ను పరీక్షించనుంది ఆక్స్​ఫర్డ్​ యూనివర్సిటీ వ్యాక్సిన్​ గ్రూప్​. ఇటు సౌతాఫ్రికా, బ్రెజిల్​లోనూ దానిపై ట్రయల్స్​ జరగనున్నాయి. ఫలితాలు సక్సెస్​ అయితే ఈ ఏడాది చివరి నాటికి వ్యాక్సిన్​ను అందుబాటులోకి తీసుకొస్తామని ఆక్స్​ఫర్డ్​ ప్రకటించింది. ‘‘క్లినికల్​ ట్రయల్స్​లో మంచి ఫలితాలు వస్తున్నాయి. పెద్దల్లో ఆ వ్యాక్సిన్​ ఎలాంటి ఇమ్యూన్​ రెస్పాన్స్​ ఇస్తుందో తెలుసుకునేందుకు ఫైనల్​ ట్రయల్స్​ స్టార్ట్​ చేస్తున్నాం. పెద్ద సంఖ్యలో జనానికి అది రక్షణ కల్పిస్తుందా లేదా అన్నది తేలుస్తాం’’ అని ఆక్స్​ఫర్డ్​ వ్యాక్సిన్​ గ్రూప్​ హెడ్​ ప్రొఫెసర్​ పొలార్డ్​ చెప్పారు.

కాళేశ్వరం ఖర్చులు పెరిగితే తప్పేంటి?