హోటల్ ఓనర్లకు ఓయో ఫండింగ్‌‌ రూ.45 కోట్లు

హోటల్ ఓనర్లకు ఓయో ఫండింగ్‌‌ రూ.45 కోట్లు

న్యూఢిల్లీ :  కస్టమర్ సంతృప్తి చెందేలా ఓయో హోటల్స్‌‌ను  సరికొత్తగా అప్‌‌గ్రేడ్ చేస్తోంది ఆ కంపెనీ. దీని కోసం ఇప్పటికే హోటల్ ఓనర్లకు క్యాష్ ఇన్ బ్యాంక్ కార్యక్రమం కింద రూ.45 కోట్లను అందించింది. ఇండస్ట్రీలోనే ఇలాంటి కార్యక్రమం చేపట్టడం ఇదే తొలిసారి.  ఈ ప్రొగ్రామ్ కింద 9 వేల మందికి పైగా లబ్ది పొందినట్టు తెలిసింది. ఇదే క్రమంలో నాణ్యతపరమైన నిబంధనలను పాటించని వెయ్యి మంది బిల్డింగ్స్‌‌ ఓనర్లపై జరిమానాలు కూడా  విధించింది.  ఇండియాలో, సౌత్ ఏసియాలో కంపెనీ మరింత వృద్ధి సాధించాలనే క్రమంలో తనకున్న 10 వేలకు పైగా హోటల్స్‌‌లో 3సీ ఎవాల్యుషన్ ప్రొగ్రామ్‌‌ను చేపడుతోంది. దీనిలో భాగంగానే బిల్డింగ్ ఓనర్లపై పెనాల్టీలు విధించింది. బిల్డింగ్ 3సీ స్కోరే బిల్డింగ్ ఓనర్లు మెయింటనెన్స్‌‌ ఎలా చేపడుతున్నారనేది నిర్ణయిస్తుంది. బిల్డింగ్ ఓనర్లు కస్టమర్లను ఆకట్టుకుంటూ సక్సెస్ సాధించడానికి తగిన చర్యలను తీసుకుంటున్నామని, కాపెక్స్‌‌లో దీని కోసం వేల కోట్ల మనీని ఇన్వెస్ట్‌‌ చేసినట్టు ఓయో హోటల్స్ అండ్ హోమ్స్ చీఫ్ సప్లయ్ ఆఫీసర్ ఆయుష్ మాథుర్ చెప్పారు. ఈ ఆపరేషన్స్‌‌ను చూసుకోవడం కోసం వందల మంది జీఎంలను నియమించినట్టు పేర్కొన్నారు.