న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఐపీఓకి రావాలని చూస్తున్న ట్రావెల్ టెక్ కంపెనీ ఓయో, తన అన్‌లిస్టెడ్ ఈక్విటీ షేర్‌హోల్డర్లకు ఇచ్చే బోనస్ షేర్ల అప్లికేషన్ గడువును నవంబర్ 1 నుంచి నవంబర్ 7 వరకు పొడిగించింది. షేర్‌హోల్డర్ల నుంచి ఫీడ్‌బ్యాక్ వచ్చాక ఈ నిర్ణయం తీసుకుంది. షేర్‌హోల్డర్లకు బోనస్ ఆప్షన్ ఎంచుకోవడానికి సమయం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ బోనస్ ఇష్యూలో, ప్రతి 6 వేల ఈక్విటీ షేర్లకు ఒక ప్రిఫరెన్స్ షేర్ లభిస్తుంది. షేర్‌హోల్డర్లకు రెండు ఆప్షన్స్ ఇచ్చారు.
ఒకటి ఫిక్స్‌డ్ కన్వర్షన్. ఈ ఆప్షన్ ఎంచుకుంటే ప్రతి ప్రిఫరెన్స్ షేర్ ఒక ఈక్విటీ షేర్‌గా మారుతుంది. షేర్ల కన్వర్షన్‌లో అనిశ్చితి ఉండదు. రెండవది మైల్స్ స్టోన్ -లింక్డ్ ఆప్షన్. ఓయో తన ఐపీఓ కోసం బ్యాంకర్లను నియమించడాన్ని మైల్స్‌స్టోన్‌గా పరిగణించింది. అంటే బ్యాంకర్లను నియమించాక ప్రిఫరెన్షియల్ షేర్లు ఈక్విటీ షేర్లు కన్వర్ట్ అవుతాయి.
సాఫ్ట్‌బ్యాంక్ విజన్ ఫండ్, కంపెనీ ఫౌండర్ రితేష్ అగర్వాల్‌కు చెందిన సంస్థలు ఇప్పటికే ప్రిఫరెన్స్ షేర్లను కలిగి ఉన్నందున, ఇవి బోనస్‌కు అర్హులు కావు. ఈ బోనస్ కంపల్సరి కన్వర్టబుల్ ప్రిఫరెన్షియల్ షేర్స్ (సీసీపీఎస్), గతంలో ఇచ్చిన 1:1 ఈక్విటీ బోనస్‌కి భిన్నంగా ఉంటుంది. కాగా, ఓయో 8 బిలియన్ డాలర్ల వాల్యుయేషన్ దగ్గర ఐపీఓకి వస్తోంది.
