ఓయో లాభం రూ.623 కోట్లు

ఓయో లాభం రూ.623 కోట్లు

న్యూఢిల్లీ: గ్లోబల్ ట్రావెల్ టెక్ ప్లాట్‌‌‌‌ఫామ్ ఓయో, 2024–-25 ఆర్థిక సంవత్సరంలో రూ.623 కోట్ల నికర లాభాన్ని సాధించింది. కిందటి ఆర్థిక సంవత్సరంలో ఇండియాలో ఎక్కువ లాభాన్ని పొందిన స్టార్టప్‌‌‌‌గా నిలిచామని కంపెనీ ఫౌండర్‌‌‌‌‌‌‌‌ రితేష్ అగర్వాల్  పేర్కొన్నారు. ఆడిట్ కాని ఫైనాన్షియల్స్‌‌‌‌ ప్రకారం, కంపెనీ 2023–24 లో  రూ.229 కోట్ల  నికర లాభం పొందగా, 2024–25 లో 172 శాతం వృద్ధి నమోదు చేసింది.  కంపెనీ ఇబిటా (ట్యాక్స్‌‌‌‌లు, వడ్డీలకు ముందు ప్రాఫిట్‌‌‌‌) రూ.1,132 కోట్లకు చేరింది.

 అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.889 కోట్లుగా ఉంది.  27 శాతం గ్రోత్‌‌‌‌కు సమానం. ఓయో గ్రాస్ బుకింగ్ వాల్యూ (జీబీవీ) 54 శాతం పెరిగి రూ.16,436 కోట్లకు చేరగా,  రెవెన్యూ 20 శాతం పెరిగి రూ.6,463 కోట్లకు ఎగసింది.