శబరిమల ఆలయ ప్రధాన అర్చకులిగా పీఎన్ మహేశ్, పీజీ మురళి నియామకం

శబరిమల ఆలయ ప్రధాన అర్చకులిగా పీఎన్ మహేశ్, పీజీ మురళి  నియామకం

శబరిమలలోని అయ్యప్ప ఆలయ ప్రధాన అర్చకుడిగా ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ)  మువట్టుపుజాకు చెందిన పీఎన్ మహేశ్‌ను నియమించింది. మహేష్ ప్రస్తుతం త్రిసూర్‌లోని పారమెక్కావు ఆలయానికి మెల్శాంతిగా పనిచేస్తున్నారు.  వార్షిక మండల-మకరవిళక్కు సీజన్ ప్రారంభానికి ముందు మహేశ్ ను ప్రధాన అర్చకుడిగా ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు నియమించింది. మహేశ్ మువాట్టుపుజాలోని పుత్తిల్లత్   ప్రాంతానికి చెందినవాడు. తనకు లభించిన అవకాశాన్ని దైవ భాగ్యంగా భావిస్తున్నానని మహేశ్ తెలిపారు. 

గురువాయూర్ సమీపంలోని అంజూర్ పూంగట్ మనాకు చెందిన పిజి మురళి శబరిమల  ప్రాంగణంలోని మాలికాపురత్తమ్మ అమ్మవారి ఆలయంలో  ప్రధాన అర్చకుడిగా (మేల్శాంతి) ఎంపికయ్యారు. గతంలో హైదరాబాద్‌లోని సోమాజిగూడలోని అయ్యప్ప స్వామి ఆలయ ప్రధాన అర్చకుడిగా 25 ఏళ్లుగా సేవలందించారు.

శబరిమల ఆలయ కేరళ  అడ్మినిస్ట్రేటివ్ బాడీ అయిన ట్రావెన్‌కోర్ దేవస్థానమ్  బోర్డ్ (TDB) శబరిమల ఆలయ ప్రదాన అర్చకుల (ఏడాది కాలం పాటు)  పోస్టులకు ఇంటర్వ్యూలను నిర్వహించింది.  షార్ట్ లిస్ట్ అనంతరం పూజారుల ప్యానెల్ నుంచి లాటరీ ద్వారా ఇద్దరు ప్రదాన అర్చకులను ఎంపిక చేస్తారు.  పందళం రాజ కుటుంబానికి చెందిన వైదే వర్మ..  నిరుపమ జి వర్మ .. శబరిమల,, మాలికాపురత్తమ దేవి అమ్మవారి ఆలయాల అర్చకుల కోసం  TDB అధికారుల సమక్షంలో  లాటరీ పద్దతి ద్వారా  పీఎన్  మహేశ్ , పీజీ మురళీ లను ఎంపిక చేశారు. 

మండల పూజల నిమిత్తం శబరిమల ఆలయం నవంబర్ 2 వ తేదీన TDB బోర్డు అధికారులు తెరిచారు.  తంత్రి కాంతారావు.. ప్రధాన అర్చకులు మహేశ్‌ సమక్షంలో.. నంబూద్రి కె. జయరామన్ ఆలయాన్ని ఓపెన్ చేశారు.  మాలికాపురత్తమ దేవి ఆలయ తాళాలను ప్రధాన అర్చకుడు వి హరిహరన్ కు అందజేశారు. 

తులమాస పూజల కోసం శబరిమల ఆలయం మంగళవారం తెరుచుకుంది. తంత్రి కాంతారావు మహేశ్‌మోహన్‌ సమక్షంలో ప్రధాన అర్చకులు కె.జయరామన్‌ నంబూతిరి ఆలయాన్ని ప్రారంభించారు. అదనంగా, ఆలయ ప్రారంభోత్సవం కోసం మలికప్పురం ఆలయ తాళాలను ప్రధాన అర్చకుడు వి హరిహరన్‌కు అందజేశారు