వంద శాతం ఆస్తి పన్ను వసూలే లక్ష్యం : శాంతి కుమార్

వంద శాతం ఆస్తి పన్ను వసూలే లక్ష్యం : శాంతి కుమార్

తొర్రూరు, వెలుగు : మున్సిపాలిటీకి ప్రధాన ఆదాయ వనరైన ఆస్తి పన్ను వంద శాతం వసూలు చేయడమే లక్ష్యమని  తొర్రూరు మున్సిపల్ కమిషనర్ పి.శాంతి కుమార్ అన్నారు.  సోమవారం మహబూబాబాద్​ జిల్లా తొర్రూరు పట్టణంలో పేరుకుపోయిన బకాయి వసూళ్లలో భాగంగా కొన్నింటిని సీజ్ చేశామని, డప్పులతో చాటింపు వేస్తున్నామన్నారు.  

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ 2023 – 24 సంవత్సరానికి   ఆస్తి పన్నుదారులకు నోటీసులు ఇచ్చామని తెలిపారు.  కానీ ఇంతవరకు టాక్స్  కట్టని వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.   ఆస్తి పన్నులను  సకాలంలో చెల్లించి లబ్ధి పొందాలన్నారు.   కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ కట్ట స్వామి, హెల్త్ అసిస్టెంట్ రాజు, వార్డ్ ఆఫీసర్లు దేవేందర్ ,పట్టాభి, నవీన్, ఉపేంద్ర, బిల్ కలెక్టర్లు శంకర్, యాకయ్య పాల్గొన్నారు.