ఫామ్ హౌస్ ఆందోళన సరికాదు : చైర్మన్ కమ్మరి బాల్ రాజు

ఫామ్ హౌస్ ఆందోళన సరికాదు : చైర్మన్ కమ్మరి బాల్ రాజు

ములుగు, వెలుగు: మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ ను ముట్టడించడం కాంగ్రెస్ నాయకుల దౌర్జన్యమని పీఏసీఎస్ వైస్ చైర్మన్ కమ్మరి బాల్ రాజు అన్నారు. ఆదివారం మర్కుక్ మండలంలోని ఎర్రవల్లి గ్రామస్తులు కేసీఆర్ ఫామ్ హౌస్ గేటు ముందు గోదావరి జలాలతో శుద్ధి చేయడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కేసీఆర్ ఫామ్ హౌస్ ముట్టడి చేయడం విచిత్రంగా ఉందన్నారు. 

ముంపు గ్రామాల కోసం పోరాడిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు వారికి ఏమైనా ప్యాకేజీలు పెండింగ్​లో ఉంటే ఇప్పించాలన్నారు. కార్యక్రమంలోని బీఆర్ఎస్ నాయకులు కృష్ణ, శ్రీశైలం, పరశురాం, ప్రవీణ్, పాండు, నరసయ్య, రామ్ సింగ్, భాస్కర్, శంకర్, బాబు పాల్గొన్నారు.