ప్యాడిల్‌‌‌‌ ఫిష్‌‌‌‌ కనవడదిక

ప్యాడిల్‌‌‌‌ ఫిష్‌‌‌‌  కనవడదిక

చైనాకు చెందిన ప్యాడిల్‌‌‌‌ ఫిష్‌‌‌‌ కనుమరుగైపోయింది. లక్షల ఏళ్ల నాటి మంచి నీటి పెద్ద చేప అంతరించిపోయింది. చివరిసారిగా 2003లో ప్యాడిల్‌‌‌‌ ఫిష్‌‌ కనబడిందని, 2010 నాటికి పూర్తిగా కనబడకుండా పోయుంటుందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. ఈ చేపలు 20 కోట్ల ఏళ్ల నాటివని, జురాసిక్‌‌‌‌ కాలం నుంచి జీవిస్తున్నాయని చెప్పారు. యాంగ్జీ నదిలో ఎక్కువగా కనబడే ఈ పొడుగు మూతి చేపలు 7 మీటర్ల వరకు పెరుగుతాయని, 450 కిలోల బరువు తూగుతాయని వివరించారు. 1970ల్లో యాంగ్జీ నదిలో ఇవి బాగా కనబడేవని.. ఎక్కువగా వేటాడటం, వీటి నివాస ప్రాంతాలు తగ్గిపోవడంతో సంఖ్య తగ్గుతూ వచ్చిందని చెప్పారు. నదిపై డ్యాంలు ఎక్కువగా కట్టడంతో చేపలు వేరే ప్రాంతాలకు వెళ్లలేకపోయాయని, దీంతో సంతానోత్పత్తి బాగా తగ్గిందని అన్నారు. 2009లో వీటిని అంతరించిపోతున్న లిస్టులో చేర్చారని చెప్పారు. కాగా, నదిలో కమర్షియల్‌‌‌‌ ఫిష్షింగ్‌‌‌‌ను 10 ఏళ్ల పాటు బ్యాన్‌‌‌‌ చేస్తున్నట్టు గత వారం చైనా ప్రకటించింది.