ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు
  • యాదాద్రి జిల్లాలో 3 లక్షల ఎకరాలు దాటిన వరి
  • జిల్లా ఏర్పడ్డాక ఇదే ఫస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టైం అంటున్న ఆఫీసర్లు
  • 6.60 లక్షల మెట్రిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా

యాదాద్రి, వెలుగు: యాదాద్రి జిల్లా వ్యాప్తంగా ఈ సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వరి రికార్డు స్థాయిలో సాగైంది. వాణిజ్య పంటలు సాగు చేసే రైతులు కూడా ఈ సారి వరి వైపు మొగ్గు చూపారు. దీంతో వరి సాగు 3 లక్షల ఎకరాలు దాటింది. జిల్లా ఏర్పడినప్పటి నుంచి ఈ స్థాయిలో సాగవడం ఇదే ఫస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టైం. ఈ సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 2.40 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లు అంచనా వేశారు. యాసంగిలో వడ్ల కొనుగోలులో జాప్యం జరగడంతో ఈ సారి సాగు తగ్గుతుందని భావించారు. ఇందుకు తగ్గట్లుగానే సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మొదట్లో రైతులు పత్తి విత్తనాలు వేశారు. అయితే వాన సరిగా పడకపోవడంతో పత్తి మొలకలు రాలేదు. దీంతో పత్తి, కంది సహా ఇతర వాణిజ్య పంటలు సాగు చేసే రైతులు కూడా ఈ సారి కొత్తగా భూమిని అచ్చుకట్టి వరి సాగులోకి  దిగారు. దీంతో వరి రికార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్థాయిలో 3,00,148 ఎకరాల్లో సాగైంది. గత వానాకాలం సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 2,76,310 లక్షల ఎకరాల్లోనే వరి సాగయితే ఈ సారి సుమారు 24 వేల ఎకరాల్లో సాగు పెరిగింది. ఈ సారి 6.60 లక్షల మెట్రిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టన్నుల దిగుబడి వస్తుందని ఆఫీసర్లు అంచనా వేశారు.

వడ్ల సేకరణకు 286 సెంటర్లు

వడ్ల కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లపై గురువారం యాదాద్రి కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అడిషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డి.శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి ఆధ్వర్యంలో రివ్యూ చేశారు. ఈ సందర్భంగా ఈ సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జిల్లా వ్యాప్తంగా6.60 లక్షల మెట్రిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టన్నుల దిగుబడి రానుందని అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లు తెలిపారు. ఇందులో 6 లక్షల మెట్రిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టన్నుల వడ్లు మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వస్తాయన్నారు. అనంతరం అడిషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ ఈ సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జిల్లా వ్యాప్తంగా 286 సెంటర్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

గతంలో మాదిరిగా 85 ఐకేపీ, 197 పీఏసీఎస్, నాలుగు మార్కెట్లలో సెంటర్లు ఏర్పాట్లు చేయాలన్నారు. వడ్ల సేకరణకు అవసరమైన గన్నీ బ్యాగులు, టార్పాలిన్లు, మాయిశ్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెషీన్లు, ఎలక్ట్రానిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాంటాలను సమకూర్చుకోవాలని చెప్పారు. మార్కెట్లు, కొనుగోలు సెంటర్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో సివిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సప్లై డీఎం గోపీకృష్ణ, డీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వో శ్రీనివాస్​, డీఏవో అనురాధ, మార్కెటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సబిత పాల్గొన్నారు.

అవార్డులు వచ్చేలా పని చేయాలి

సూర్యాపేట, వెలుగు: జాతీయ పంచాయతీ అవార్డులు వచ్చేలా ఆఫీసర్లు పనిచేయాలని సూర్యాపేట కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హేమంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేశవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన జిల్లా స్థాయి శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆదర్శ గ్రామాల రూపకల్పనకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని, జాతీయ పంచాయతీ అవార్డుల అప్లికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టైంలో డాక్యుమెంటేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పటిష్టంగా చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం సూచించిన 9 విభాగాల్లో పంచాయతీ పనితీరు పరిశీలించేందుకు బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జిల్లా స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో సురేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డీఆర్డీవో కిరణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డీపీవో యాదయ్య, డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వో కోట చలం, డీడబ్ల్యూవో జ్యోతి పద్మ, సీపీవో జి.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు

నల్గొండ అర్బన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వ పాలనలోనే అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని డీసీసీబీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గొంగిడి మహేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి చెప్పారు. గురువారం నల్గొండలోని డీసీసీబీలో జరిగిన మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆయన మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశానికే రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మోడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారిందన్నారు. ఇక్కడ అమలవుతున్న పథకాలను చూసి మహారాష్ట్ర, కర్నాటక బార్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని గ్రామాల ప్రజలు తమను తెలంగాణలో కలపాలని కోరుతున్నారన్నారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశంలో మరెక్కడా లేవన్నారు. 

బీజేపీలో చేరికలు

చౌటుప్పల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌/చండూరు, వెలుగు: చౌటుప్పల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మున్సిపాలిటీ, కొయ్యలగూడెం, పంతంగి, దేవలమ్మ నాగారం గ్రామాలకు చెందిన పలువురు గురువారం మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం రాజగోపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి మాట్లాడుతూ పార్టీ గెలుపు కోసం కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు రమణగోని శంకర్, జడ్పీటీసీ ప్రభాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, పెద్దిటి బుచ్చిరెడ్డి, దూడల భిక్షం, కౌన్సిలర్లు పోలోజు శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబు, మల్లేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు. అనంతరం చండూరులో భవానీ యూత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో నిర్వహించే దేవీ నవరాత్రి ఉత్సవాల పాంప్లెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆవిష్కరించారు.

‘మన ఊరు మన బడి’ పనులు పూర్తి చేయండి

నల్గొండ అర్బన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు : ‘మన ఊరు మన బడి’ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పనులను త్వరగా పూర్తి చేయాలని నల్గొండ కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టి.వినయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కృష్ణారెడ్డి ఆదేశించారు. పనులు జరుగుతున్న తీరుపై గురువారం జడ్పీ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రివ్యూ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ జిల్లాలో ఫస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కింద ఎంపికైన 517 స్కూళ్లకు మంజూరు చేసిన పనులను గ్రౌండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలని సూచించారు. ప్రతి మండలానికి రెండు మోడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కూళ్లలో దసరా నాటికి పనులను పూర్తి చేయాలని చెప్పారు. అన్ని స్కూళ్లలో వారం రోజుల్లో పనులు ప్రారంభించాలని, నిర్లక్ష్యం చేసే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. పనులకు నిధుల కొరత లేదని, పూర్తైన పనుల వారీగా వెంట వెంటనే బిల్లులు సమర్పించాలని ఆదేశించారు. రెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బిల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఉన్న చోట ఎస్టిమేట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పూర్తి చేసి ప్రపోజల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పంపాలని చెప్పారు. సమావేశంలో జడ్పీ సీఈవో ప్రేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కరణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, సీపీవో బాలశౌరి, డీఈవో భిక్షపతి, ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ ఈఈ నరేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, పీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈఈ తిరుపతయ్య, మాధవి పాల్గొన్నారు.

కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విజయానికి కార్యకర్తలు కృషి చేయాలి

చౌటుప్పల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: మునుగోడులో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విజయానికి కార్యకర్తలు కృషి చేయాలని ఏఐసీసీ సెక్రటరీలు రోహిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చౌదరి, బోస రాజు సూచించారు. గురువారం యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆయన వారు మాట్లాడారు. ఏ పార్టీ విజయానికైనా బూత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్థాయి లీడర్లే కీలకం అన్నారు. బూత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లెవల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జులు కష్టపడి పనిచేయాలని సూచించారు. మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి పాల్గొన్నారు. 

ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి

యాదాద్రి, వెలుగు: ఆరోగ్యంపై ప్రతిఒక్కరూ శ్రద్ధ పెట్టాలని యాదాద్రి కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పమేలా సత్పతి సూచించారు. యాదాద్రి జిల్లా మోత్కూరులో గురువారం స్టూడెంట్లకు ఆల్బెండజోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్యాబ్లెట్లు పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వీలైనంత త్వరగా ట్యాబ్లెట్లు పంపిణీ పూర్తి చేయాలని హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లకు సూచించారు. యాదాద్రి జిల్లాలో 1,66,936 మందికి ట్యాబ్లెట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేయాల్సి ఉండగా 98 శాతం పంపిణీ పూర్తయిందన్నారు. అనంతరం మోత్కూరు మున్సిపాలిటీని సందర్శించారు. కార్యక్రమంలో డాక్లర్లు వినోద్, సుమన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కల్యాణ్, తహసీల్దార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అహ్మద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ శ్రీనివాస్, ఆకవరం చైతన్య కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.

సమైక్య పాలనలో కష్టాలు పడ్డాం
విద్యుత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి

చౌటుప్పల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: సమైక్యపాలనలో తెలంగాణ ప్రజలు అనేక కష్టాలు పడ్డారని విద్యుత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి చెప్పారు. యాదాద్రి జిల్లా సంస్థాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నారాయణపురంలో గురువారం నిర్వహించిన టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. మునుగోడులో ఫ్లోరైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అంతం చేసి సురక్షిత జలాలను అందిస్తున్న ఘనత టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. వ్యవసాయ దిగుబడుల్లో నల్గొండ జిల్లా ముందంజలో ఉందన్నారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశమంతా అమలు చేయాలన్న డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వస్తుండడం వల్లే ప్రధాని మోడీ కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.

కాంట్రాక్టుల కోసమే రాజగోపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి బీజేపీలో చేరారని ఆరోపించారు. మునుగోడులో టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అంతకుముందు మహిళలు, కార్యకర్తలు బతుకమ్మలు, బోనాలతో ఊరేగింపుగా సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎమ్మెల్యే గాదరి కిశోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి డ్యాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తూ కార్యకర్తల్లో జోష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నింపారు. 

టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హయాంలోనే గ్రామాల అభివృద్ధి

సూర్యాపేట, వెలుగు: టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హయాంలోనే గ్రామాలు అభివృద్ధి చెందాయని విద్యుత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి చెప్పారు. సూర్యాపేట జిల్లా సోలిపేటలో గురువారం పలు అభివృ-ద్ధి పనులను ప్రారంభించిన అనంతరం లబ్ధిదారులకు పెన్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదల సంక్షేమానికి టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు. దేశంలో ఎక్కడా లేని పథకాలు తెలంగాణలోనే అమలవుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో కులమతాలకు అతీతంగా అభివృద్ధి జరుగుతోందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ బీరవోలు రవీందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, జడ్పీటీసీ జీడి భిక్షం, డీసీఎంఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వట్టె జానయ్యయాదవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.

అర్చకుల సంక్షేమానికి కృషి

నల్గొండ అర్బన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: తెలంగాణ ఏర్పడిన తర్వాత అర్చకుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి చెప్పారు. ఎండోమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అర్చక సంక్షేమ బోర్డు మెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నియామకం అయిన దర్వేశిపురం రేణుక ఎల్లమ్మ ఆలయ అర్చకుడు శ్రవణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమారాచార్యులును గురువారం స్థానిక టీఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీవోస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ  శ్రవణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నియామకం కావడం వల్ల ఇక్కడి అర్చకుల సమస్యలపై బోర్డులో చర్చించే అవకాశం ఉంటుందన్నారు.

బ్రాహ్మణులకు సంక్షేమానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మందడి సైదిరెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రేగట్టె మల్లికార్జున్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, టీఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీవో జిల్లా అధ్యక్షుడు శ్రవణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉపేంద్రశర్మ పాల్గొన్నారు.

ఉరి వేసుకొని యువతి ఆత్మహత్య

మఠంపల్లి, వెలుగు : ఉరి వేసుకొని ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మఠంపల్లి మండలం పెదవీడులో గురువారం జరిగింది. ఎస్సై రవి తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన పెరంచు మాధవి (19) ఇంట్లో ఎవరూ లేని టైంలో ఉరి వేసుకుని చనిపోయింది. కొంత సేపటి తర్వాత గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. యువతి ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉందని ఎస్సై తెలిపారు.

మై హోంకు శక్తి పరిరక్షణ అవార్డు

మేళ్లచెరువు, వెలుగు : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువులోని మై హోం సిమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంపెనీకి శక్తి పరిరక్షణ సామర్థ్యం గల యూనిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా అవార్డు లభించినట్లు ప్లాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శ్రీనివాసరావు తెలిపారు. కాన్ఫడరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌ ఇండియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించిన 23వ జాతీయ అవార్డ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్యక్రమంలో విద్యుత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాఖ సెక్రటరీ ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే.రాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవార్డు ఇచ్చారని చెప్పారు. విద్యుత్, బొగ్గు వినియోగాన్ని తగ్గిస్తూ ఉత్పత్తి పెంచడం, వ్యర్థ పదార్థాలను తగ్గించడంతో పాటు పర్యావరణానికి హాని కలగకుండా చర్యలు చేపట్టినందున ఈ అవార్డు దక్కిందని తెలిపారు. 

పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్టులను పూర్తి చేయండి

మిర్యాలగూడ, వెలుగు: పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పోతినేని సుదర్శన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, తీగల సాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోరారు. కనీస మద్దతు ధర చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో గురువారం నిర్వహించిన రైతు మహాసభలో వారు మాట్లాడారు. కార్పొరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంపెనీలకు వేల కోట్ల రాయితీలు ఇస్తున్న బీజేపీ పాలపై జీఎస్టీ విధించడం సరికాదన్నారు.

ఎరువులపై సబ్సిడీ ఎత్తివేసేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని ఆరోపించారు. అంతకుముందు సంఘం జెండాను రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండ శ్రీశైలం ఆవిష్కరించారు. సమావేశంలో నాయకులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, కందాల ప్రమీల, చాపల మారయ్య ముదిరెడ్డి సుధాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, డి.అశోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఐతరాజు నరసింహ, జిల్లా కార్యదర్శి కున్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి నాగిరెడ్డి, సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మల్లేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డీవైఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ జిల్లా అధ్యక్షుడు రవినాయక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.

కుంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫూలో భువనగిరి స్టూడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు గోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

భువనగిరి అర్బన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు : హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరిగిన జాతీయ స్థాయి జూనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫూ పోటీల్లో యాదాద్రి జిల్లా భువనగిరికి చెందిన సీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. హర్షతేజ గోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాధించాడు. ఈ సందర్భంగా గురువారం కుంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫూ కోచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సందీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సురేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అభినందించారు. మార్షల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాణించాలని సూచించారు.

ట్రిపుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అలైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్చండి

యాదాద్రి, వెలుగు : ట్రిపుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అలైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్చాలని బీజేపీ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు పీవీ.శ్యాంసుందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు కోరారు. ఈ మేరకు రైతులు, బాధితులతో కలిసి గురువారం నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హైవే చీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంజినీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గణపతిరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ట్రిపుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కారణంగా జిల్లాలో అనేక మంది రైతుల భూములు కోల్పోతున్నారన్నారు. ఇప్పటికే పలుమార్లు భూములు కోల్పోయామని, మరోసారి భూములు తీసుకుంటే ఉపాధి కోల్పోయి రోడ్డున పడుతామని ఆవేదన వ్యక్తం చేశారు. అలైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్చి తమకు న్యాయం చేయాలని కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో బీజేపీ నాయకులు చిట్టెడి నర్సింహారెడ్డి, కర్నాటి ధనుంజయ, కొండం ఉపేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బాధితులు పసుపునూరి నాగభూషణం, గడ్డమీది మల్లేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పాండు ఉన్నారు.  

కుంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫూలో భువనగిరి స్టూడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు గోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

భువనగిరి అర్బన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు : హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరిగిన జాతీయ స్థాయి జూనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫూ పోటీల్లో యాదాద్రి జిల్లా భువనగిరికి చెందిన సీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. హర్షతేజ గోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాధించాడు. ఈ సందర్భంగా గురువారం కుంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫూ కోచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సందీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సురేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అభినందించారు. మార్షల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాణించాలని సూచించారు.

పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్టులను పూర్తి చేయండి

మిర్యాలగూడ, వెలుగు: పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పోతినేని సుదర్శన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, తీగల సాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోరారు. కనీస మద్దతు ధర చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో గురువారం నిర్వహించిన రైతు మహాసభలో వారు మాట్లాడారు.

కార్పొరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంపెనీలకు వేల కోట్ల రాయితీలు ఇస్తున్న బీజేపీ పాలపై జీఎస్టీ విధించడం సరికాదన్నారు. ఎరువులపై సబ్సిడీ ఎత్తివేసేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని ఆరోపించారు. అంతకుముందు సంఘం జెండాను రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండ శ్రీశైలం ఆవిష్కరించారు. సమావేశంలో నాయకులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, కందాల ప్రమీల, చాపల మారయ్య ముదిరెడ్డి సుధాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, డి.అశోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఐతరాజు నరసింహ, జిల్లా కార్యదర్శి కున్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి నాగిరెడ్డి, సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మల్లేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డీవైఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ జిల్లా అధ్యక్షుడు రవినాయక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.