తెలంగాణలో వడ్ల కొనుగోళ్లు షురూ

తెలంగాణలో వడ్ల కొనుగోళ్లు షురూ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో  వడ్ల కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. గురువారం నాటికి 7149 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా,  నల్లగొండ, నిజామాబాద్ జిల్లాల్లో 19 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయని అధికారులు తెలిపారు.

 అయితే యాసంగి వరి సేకరణ కార్యకలాపాలు  ఏప్రిల్ 1 నుంచి ప్రారంభంకావాల్సి ఉండగా, కొన్ని జిల్లాల్లో మార్చిలోనే వరి కోతలు ప్రారంభమయ్యా యి. దీన్ని దృష్టిలో పెట్టుకొని వరి కొనుగోళ్లు ముందుగా ప్రారంభించేందుకు అనుమతి వ్వాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం రెక్వెస్ట్ చేయగా, ఈనెల 25నుంచి వడ్ల కొనుగోళ్లకు అనుమతిచ్చింది.