V6 News

కొనుగోలు సెంటర్లలోనే వడ్లు అమ్మాలి .. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్మన్ బక్కి వెంకటయ్య 

కొనుగోలు సెంటర్లలోనే వడ్లు అమ్మాలి .. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్మన్ బక్కి వెంకటయ్య 

తొగుట(మిరుదొడ్డి), వెలుగు: రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే అమ్మి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా అక్బరుపేట, -భూంపల్లి, మిరుదొడ్డి మండలంలోని పోతారెడ్డిపేట, చెప్యాల, మల్లుపల్లి గ్రామాల్లో వడ్ల కొనుగోలు సెంటర్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యలను కల్పించాలన్నారు. ధాన్యం కొనుగోలులో ఎలాంటి అవకతవకలు జరిగినా ఉపేక్షించేది లేదని కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెంకటయ్యను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్లు కొంగరి రవి, బొమ్మరి సంయుక్త-, డైరెక్టర్లు, చెప్యాల సర్పంచ్ కమటం అంకిత, జీడిపల్లి రవి పాల్గొన్నారు.