పాడి కౌశిక్​ రెడ్డికి సొంత పార్టీలోనే ఎదురుగాలి

పాడి కౌశిక్​ రెడ్డికి సొంత పార్టీలోనే ఎదురుగాలి

జమ్మికుంట, వెలుగు: ప్రభుత్వ విప్​గా బాధ్యతలు స్వీకరించిన పాడి కౌశిక్​ రెడ్డి తొలిసారిగా జమ్మికుంట పట్టణానికి వచ్చారు. ఆబాది జమ్మికుంటలో పోచమ్మ గుడి ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరై బోనం ఎత్తుకున్నారు.  విప్​ కౌశిక్​రెడ్డి  వెంట జమ్మికుంట జడ్పీటీసీ డాక్టర్​ శ్రీరాం శ్యాం,  పలువురు వీణవంక ప్రాంతానికి చెందిన నేతలు తప్ప జమ్మికుంట, హుజురాబాద్​, ఇల్లందకుంట, కమలాపూర్​ ప్రాంతానికి చెందిన నేతలు ఎవరు కూడా విప్​కు స్వాగతం పలకడానికి హాజరు కాకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

 లోకల్​ నేతలను పట్టించుకోకపోవడంతోనే.... 

ఎమ్మెల్సీగా ఎన్నికైన నాటి నుంచి పాడికౌశిక్​ రెడ్డి కాంగ్రెస్​ పార్టీ నుంచి వచ్చి బీఆర్​ఎస్​లో చేరిన నేతలను తప్ప ముందు నుంచి పార్టీలో ఉన్న  బీఆర్ఎస్​ నాయకులను అస్సలు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.  నియోజకవర్గంలో సుమారు 200 చిన్నా చితక మార్కెట్​ కమిటీ  చైర్మన్లు, మున్సిపాలిటీలలో కో ఆప్షన్​ సభ్యులు, దేవాలయ కమిటీలు, పార్టీ పదవులు నామినేటెడ్​ చేయడానికి ఉన్నా కౌశిక్​ రెడ్డి చొరవ చూపడం లేదని అయన స్వార్థమే చూసుకుంటున్నారని బీఆర్ఎస్​ నేతలు బాహటంగానే విమర్శలు చేస్తున్నారు.