భూకబ్జాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి : పద్మ

భూకబ్జాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి : పద్మ
  •     సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పద్మ  

కామారెడ్డి టౌన్, వెలుగు: బీఆర్ఎస్​హయాంలో భూకబ్జాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పశ్య పద్మ డిమాండ్​ చేశారు.  ఆదివారం కామారెడ్డిలో జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. పద్మ మాట్లాడుతూ.. ధరణి వెబ్​సైట్​లో పేర్లు లేవని చెప్పి కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ నియోజకవర్గాల్లో చాలా మంది నిరుపేదల భూములను లాక్కున్నారని ఆరోపించారు.

కామారెడ్డి టౌన్​లో పలు చోట్ల భూములను అక్రమించి రియట్​ఎస్టేట్ చేస్తున్నారని అన్నారు. వీరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​చేశారు. పార్లమెంట్​ఎన్నికల దష్ట్యా కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం అయోధ్యలో రాముడి గుడి నిర్మాణం పేరుతో ఓటర్లకు గాలం వేస్తోంన్నారన్నారు. కోట్ల సంఖ్యలో ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే వంద రోజుల్లో  హామీలను నెరవేరుస్తామన్న కాంగ్రెస్ మాట​ నిలబెట్టుకోవాలని కోరారు.

ఇటీవల సీపీఐ జిల్లా కార్యదర్శి ఇంటిపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. పార్టీ సీనియర్​ లీడర్​వీఎల్ నర్సింహారెడ్డి, జిల్లా కార్యదర్శి ఎల్. దశరథ్, లీడర్లు నర్సింలు, దేవయ్య, పుష్పలత, శ్యామల,ఈశ్వర్, శివప్రసాద్​పాల్గొన్నారు.