‘పద్మ’ అవార్డు తీసుకొని.. సీఎం ఇంటి ముందు రెజ్లర్ నిరసన

‘పద్మ’ అవార్డు తీసుకొని.. సీఎం ఇంటి ముందు రెజ్లర్ నిరసన

చండీగఢ్: వినికిడి సమస్యతో బాధపడుతున్న క్రీడాకారులను పారా అథ్లెట్లుగా గుర్తించాలని డిమాండ్ చేశారు రెజ్లర్, పద్మశ్రీ అవార్డు గ్రహీత వీరేందర్ సింగ్. ఢిల్లీలోని హరియాణా భవన్ బయట కూర్చుని నిరసన తెలిపారు. తాను తీసుకున్న అర్జున అవార్డు, పద్మ పురస్కారం, ఇతర మెడల్స్‌‌ను వెంట తీసుకొచ్చి సీఎం ఇంటి ముందు ఆందోళన చేశారు. కేంద్రం పారా అథ్లెట్లకు సమాన హక్కులు కల్పిస్తున్నప్పుడు.. హరియాణా సర్కార్ ఎందుకు ఇవ్వడం లేదన్నారు. వినికిడి సమస్యతో బాధపడుతున్న క్రీడాకారులను పారా అథ్లెట్లుగా గుర్తించే వరకు ఆందోళన కొనసాగిస్తానన్నారు. అయితే రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ పురస్కారం అందుకొని.. ఆ వెంటనే ఢిల్లీలోని హరియాణా భవన్ ముందు ఆందోళన‌‌కు దిగడం హాట్ టాఫిక్‌‌గా మారింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌‌గా మారింది.

మరిన్ని వార్తల కోసం: 

నేరం ఒప్పుకోలేదని యువకుడ్ని చితకబాదిన పోలీసులు

పంజాబ్‌లో ఎలా కొంటున్నరో.. తెలంగాణలోనూ అట్లనే కొనాలె

టీకా తీసుకున్న తర్వాతి రోజు ప్రసవం.. బిడ్డ మృతితో ఏఎన్ఎంపై దాడి