
కామారెడ్డి: కరోనా టీకా తీసుకున్న గర్భిణికి పుట్టిన శిశువు మృతి చెందిన ఘటన గాంధారిలో కలకలం రేపింది. గాంధారి మండలం, రాంపూర్ గడ్డకు చెందిన శ్రీలత అనే ఏడు నెలల గర్భిణి ఈ నెల1న పోతంగల్ ఉప ఆరోగ్య కేంద్రంలో కరోనా వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకుంది. తర్వాతి రోజే నెలలు నిండకముందే శ్రీలత ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే శిశువు అనారోగ్యంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. కానీ ట్రీట్‌మెంట్ పొందుతూనే చిన్నారి మృతి చెందింది. దీంతో టీకా వికటించే శిశువు చనిపోయిందనే అనుమానంతో.. ఏఎన్‌ఏం సావిత్రిపై శ్రీలత బంధువులు దాడి చేశారు. ఈ ఘటనపై సదాశివ నగర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది.