చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డు

చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డు

రిపబ్లిక్ డే సందర్భంగా 2024 పద్మ అవార్డులను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. వివిధ రంగాల్లో ప్రతిష్టాత్మక, అసాధారణ సేవలు అందించినందుకు గాను భారత రత్న, పద్మ విభూషన్, పద్మ భూషణ్ అవార్డులతో సత్కరిస్తుంది. ప్రముఖ తెలుగు నటుడు చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించింది కేంద్రం. చిరంజీవితో పాటు వెంకయ్యనాయుడు, వైజయంతిమాల లకు పద్మవిభూషణ్ దక్కింది. మొత్తం ఐదుగిరికి పద్మవిభూషణ్, 17 మందికి పద్మభూషణ్ అవార్డులను ప్రకటించారు.బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ కు ప్రతిష్టాత్మక భారతరత్న లభించింది.

ఈ ఏడాది మొత్తం 110 మందికి పద్మశ్రీ అవార్డులను ప్రకటించారు. తెలంగాణలోని జనగామకు చెందిన యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య, నారాయణపేట జిల్లా దామరగిద్దకు చెందిన బుర్ర వీణ కళాకారుడు దాసరి కొండప్పలకు పద్మశ్రీ అవార్డు  లభించింది. తెలంగాణకు చెందిన వేలు ఆనందాచారినిపద్మశ్రీ  వరించింది.మరోవైపు ఏపీకి చెందిన హరికథ కళాకారిణి డి. ఉమామహేశ్వరికి పద్మశ్రీ అవార్డు లభించింది. వీరితోపాటు దేశంలోనే తొలి మహిళా మావటి పార్వతి బారువా, అసోంకు చెందిన జగేశ్వర్ యాదవ్ లతో పాటు 110 మందికి ఈ అవార్డును ప్రకటించింది కేందం.