ట్రోల్స్ చేస్తున్న వారిపై ఫిర్యాదు చేశా..

ట్రోల్స్ చేస్తున్న వారిపై ఫిర్యాదు చేశా..

యూట్యూబ్ చానెల్స్ ద్వారా ట్రోల్స్ చేస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సినీ నటుడు మంచు విష్ణు స్పష్టం చేశారు. ఇప్పటికే రెండు ఐపీ అడ్రస్ లు గుర్తించారని.. ఒకటి జూబ్లీహిల్స్, ఇంకోటి చెక్ పోస్ట్ దగ్గర్లో ఉన్నాయన్నారు. త్వరలో మరో 18 యూట్యూబ్ చానల్స్ పేర్లు కూడా తెలుస్తాయని, వాటిపైనా ఎఫ్ఐఆర్ నమోదవుతుందని విష్ణు చెప్పారు. ట్రోలింగ్ అనేది 70, 80ల నుంచి వస్తున్నవేనన్న ఆయన... అప్పట్లో మ్యాక్జిన్ లలో వచ్చేవి.. ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తు్న్నాయన్నారు. ఈ ట్రోల్స్ విషయంలో అప్పట్లో కొంచెం ఎథిక్స్ ఉంటుండేనని, ఇప్పుడవి కొందరిలో లేవనిపిస్తుందని ఆరోపించారు. కావాలనే కొంతమంది పెయిడ్ బ్యాచ్ ఈ ట్రోలింగ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -నిజానికి ఇలాంటి వారిని పట్టించుకోవద్దనుకున్నానన్న మంచు విష్ణు.. కానీ ఇంకా మితిమీరి పోతున్నారని, అది ఎవరికీ మంచిది కాదని చెప్పుకొచ్చారు.

అక్టోబర్ 5న ట్రైలర్, 21న జిన్నా మూవీని రిలీజ్ చేస్తున్నామని మంచు విష్ణు తెలిపారు. ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరూ కష్టపడ్డారన్న ఆయన... తాము జిన్నా మూవీని అక్టోబర్ 5న రిలీజ్ చేస్తామని ఎప్పుడూ చెప్పలేదని.. అసలు అలా అనుకోలేదని స్పష్టం చేశారు. మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అనుకున్నంత ఫాస్ట్ కూడా అవ్వలేదన్నారు. థియేటర్స్ దొరకట్లేదనేది అపోహ మాత్రమేన్న మంచు విష్ణు..  తమకు అలాంటి పరిస్థితి రాలేదని చెప్పారు. దసరాతో పాటు దీపాళికి కూడా సినిమాలు మంచిగా ఆడతాయని, -సినిమాని ప్యాషన్ తో పాటు డబ్బుల కోసం కూడా చేస్తామని తెలిపారు.