
న్యూఢిల్లీ: నేషనల్ ఆర్ట్ గ్యాలరీ నిర్వహించిన ఈ వేలంలో ‘మోడీ విత్ గాంధీ’ పెయింటింగ్ ఎక్కువ ధరకు అమ్ముడు పోయింది. బేస్ ధర రెండున్నర లక్షలుగా నిర్ణయించగా.. వేలంలో రూ.25లక్షల 5 వందలు పలికిందని పీఎంవో వర్గా లు తెలిపాయి . ప్రధాని నరేంద్ర మోడీకి బహుమతిగా వచ్చిన 2,772 మెమెంటోలు, బహుమతులను కేంద్ర సాంస్కృతిక శాఖ వేలం వేసింది. ఈ బహుమతుల్లో పలు దేవతా విగ్రహాలు, శాలువాలు,వివిధ కళాఖండా లు, పుస్తకాలు, ఇతర వస్తువులుఉన్నాయి. ఈ మెమెంటోల బేస్ ధరలు కనీసం రూ.200 నుంచి గరిష్టం గా రూ.2.5 లక్షలుగా నిర్ణయించారు. ఢిల్లీలోని నేషనల్ మోడర్న్ఆర్ట్గ్యాలరీలో వీటిని ప్రదర్శించారు. సెప్టెం బర్ 14 నుంచి ఈ నెల 3 వరకు ఆన్లైన్వేలం నిర్వహించారు. ఈ వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని నమామి గంగే ప్రాజెక్టు కు వినియోగిస్తామని అధికారులు చెప్పారు.