
- నిర్మాణం కోసం అమెరికాతో సంప్రదింపులు
- పాస్నీలో లభించే కీలక ఖనిజాల రవాణా కోసం ప్లాన్
న్యూయార్క్: అరేబియా సముద్రంలో పోర్ట్‌ను నిర్మించేందుకు పాకిస్తాన్ ప్రయత్నాలు చేస్తున్నది. ఈ మేరకు అమెరికాను ఆ దేశం సంప్రదించినట్టు వార్తా కథనాలు వెలువడ్డాయి. గత నెలలో అమెరికాలో పర్యటించినప్పుడు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆ దేశ ఆర్మీ చీఫ్ ఆసీం మునీర్ ఈ ప్రతిపాదనలు చేశారు. పాకిస్తాన్‌లోని పాస్నీలో లభించే కీలక ఖనిజాల రవాణాకు దీన్ని ఉపయోగించుకోవాలని పాకిస్తాన్ ఆలోచిస్తున్నది.
పాస్నీ ఓ ఓడరేవు పట్టణం. ఇది అఫ్గానిస్తాన్-– ఇరాన్ సరిహద్దులో ఉన్న బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో ఉన్నది. కాగా, వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో భేటీకి ముందే మునీర్ అడ్వైజర్లు.. ఈ పోర్ట్ అంశాన్ని యూఎస్ అధికారులో చర్చించినట్టు సమాచారం. అమెరికా సైనిక స్థావరాల కోసం మాత్రం ఈ ఓడరేవును ఉపయోగించుకోవద్దని అమెరికాను పాక్ కోరినట్టు తెలిసింది. దీనికి బదులుగా వెస్ట్ పాకిస్తాన్‌లోని ఖనిజాలు లభించే ప్రావిన్స్‌లకు టెర్మినల్‌ను అనుసంధానించే రైలు కారిడార్ అభివృద్ధికి నిధులు కోరినట్లు సమాచారం. ఈ టెర్మినల్ ప్రాజెక్టు గురించి అటు అమెరికా అధికారులు కానీ.. ఇటు పాక్ అధికారులు కానీ ఎవరు స్పందించలేదు. దీనిపై
పాక్ ఆర్మీ కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు.