పాక్​లో మే 9 వరకు లాక్​డౌన్ పొడిగింపు

పాక్​లో మే 9 వరకు లాక్​డౌన్ పొడిగింపు

ఇస్లామాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి నిరోధించడానికి పాకిస్తాన్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ను మే 9 వరకు పొడిగించింది. ఇప్పటికి పాక్ లో 11,728 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 248 మంది మృత్యువాత పడ్డారు. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం జరిగిన పాక్ నేషనల్ కోఆర్డీనేషన్ కమిటీ సమావేశంలో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ లాక్​డౌన్ పెంపు నిర్ణయం తీసుకున్నట్లు అక్కడి మీడియా వెల్లడించింది. వైరస్ సోకిన వారిని గుర్తించేందుకు ట్రేస్ అండ్ ట్రాక్ సిస్టమ్ శనివారం నుంచి ప్రారంభిస్తున్నామని ప్లానింగ్ అండ్ డెవలప్‌మెంట్ మంత్రి అసద్ ఉమర్ చెప్పారు. రంజాన్ మాసం ప్రారంభమైన నేపథ్యంలో ప్రజలు మరింత బాధ్యతగా వ్యవహరించాలని, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోతే మరిన్ని ఆంక్షలు విధించాల్సి వస్తుందని మంత్రి హెచ్చరించారు.