అమ్మకానికి పాకిస్తాన్ దేశం: బేరం ఆడుతున్న సౌదీ రాజు

అమ్మకానికి పాకిస్తాన్ దేశం: బేరం ఆడుతున్న సౌదీ రాజు

భారత్ లో పర్యటనకు ముందు సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ పాకిస్తాన్ లో పర్యటించనున్నారు. సెప్టెంబర్ 10న ఇస్లామాబాద్ లో పర్యటిస్తారు. పాక్ తాత్కాలిక ప్రధాని అన్వర్ ఉల్ హక్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ లతో సమావేశం కానున్నారు. పాక్ లో తాత్కాలిక ప్రభుత్వం కొనసాగుతున్న నేపథ్యంలో సౌదీ యువరాజు పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ పర్యటన వెనక పెద్ద డీల్  ఉందని అక్కడి తాజా రాజకీయ పరిస్థితులు తెలిసిన వ్యక్తులు చెబుతున్నారు. 

ప్రస్తుత పరిస్థితుల్లో పాక్ ప్రధాని, ఆర్మీ చీఫ్ లతో సౌదీ యువరాజు సమావేశం చర్చనీయాంశం అయింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం పాక్ ఆర్మీ చీఫ్ ను కలవడమే ప్రధాన లక్ష్యం అని అంటున్నారు. కేవలం ఆర్మీ చీఫ్ ఇమేజ్ ని బలోపేతం చేయడం కోసమే సౌదీ యువరాజు పర్యటన లక్ష్యమని అంటున్నారు. ఎందుకంటే అతడు తెర వెనక పాత్రధారి.. ప్రభుత్వం ఎన్నికయ్యే వరకు కేర్ టేకర్ అని అంటున్నారు.  

తాత్కాలిక ప్రభుత్వం కొనసాగుతున్న నేపథ్యంలో పాక్ ను సందర్శించడానికి ఎటువంటి కారణం లేనప్పటికీ పెట్టుబడులకు ఏవైనా మార్గాలు కోసం కారణం అయి ఉండొచ్చని సందేహం వ్యక్తం చేస్తున్నారు. . ‘పెట్టుబడుల కోసం ఒక మార్గం అయినా..  పాకిస్తాన్ అమ్మకానికి ఉంది. సౌదీ అరేబియా కొనుగోలుదారుల్లో ఒకటి.. సౌదీ యువరాజు పర్యటన దీనికి మార్గం వేస్తోందని అంటున్నారు అక్కడి తాజా రాజకీయ పరిస్థితులు తెలిసిన వ్యక్తుల్లో ఒకరు.