మీ లగేజి మీరే మోసుకెళ్లాలి.. ఆస్ట్రేలియాలో పాక్ క్రికెటర్లకు ఘోర అవమానం

మీ లగేజి మీరే మోసుకెళ్లాలి.. ఆస్ట్రేలియాలో పాక్ క్రికెటర్లకు ఘోర అవమానం

వరల్డ్ కప్ 2023 టోర్నీ కోసం భారత్ విచ్చేసిన పాకిస్తాన్ క్రికెటర్లను ఎంత మంచిగా చూసుకున్నాం.. ఆ ముక్కలు ఒక్కటి తప్ప అన్నీ వడ్డించాం.. అది కూడా ఐసీసీ వద్దందనే. లేదంటే అవీ పెట్టేవాళ్లం. పైగా హోటల్ నుంచి స్టేడియానికి చేరుకోవడానికి లక్సరీ బస్సులు.. ఒక నగరం నుంచి మరొక నగరానికి వెళ్లడానికి ప్రత్యేక విమానాలు.. అక్కడక్కడ ప్రత్యేక విందులు.. ఇలా రాజభోగాలు అనుభవించారు. అయినప్పటికీ, భారత దేశం సరైన అతిథి మర్యాదులు చేయలేదని ఏడుపు లెక్కించారు. ఆ పాపం ఊరికే పోతుందా! పాక్ క్రికెటర్ల వక్రబుద్ధికి ఇప్పుడు తగిన శాస్తి జరిగింది. 

మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం పాకిస్తాన్ క్రికెట్ జట్టు.. ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. ఇప్పటికే ఆ జట్టు ఆటగాళ్లు ఆస్ట్రేలియాలోని కాన్‌బెర్రా చేరుకోగా.. అక్కడ వారికి చేదు అనుభవం ఎదురైంది. ఆటగాళ్ల లగేజీని తరలించడానికి సిబ్బంది కరువయ్యారు. దీంతో పాక్ క్రికెటర్లే ఎవరికి వారుగా లగేజి మోసుకెళ్లారు. మహ్మద్ రిజ్వాన్‌తో సహా పలువురు ఆటగాళ్లు తమ లగేజీని లోడ్ చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మీ లగేజి మీరే మోసుకెళ్లాలి..

పాక్ క్రికెటర్లు లగేజి మోసుకెళ్లడంపై నెట్టింట జోకులు పేలుతున్నాయి. అది పాకిస్తాన్ కాదు.. ఆస్ట్రేలియా.. మీ వస్తువులు మీరే మోసుకెళ్లాలి అని నెటిజెన్స్ కామెంట్లు చేస్తూ వారిని ఆడుకుంటున్నారు. ఆఖరికి ఆ దేశ అభిమానులు కూడా ఈ ఘటనపై జోకులు పేల్చుతున్నారు. ఆస్ట్రేలియా క్రికెటర్లు మన దేశానికి వస్తారు.. అప్పుడు పగ తీర్చుకుందాం.. అని వారికి సర్ధిచెప్తున్నారు.

పాకిస్తాన్ vs ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ షెడ్యూల్

  • మొదటి టెస్ట్ (డిసెంబర్ 14 - డిసెంబర్ 18): పెర్త్ స్టేడియం, పెర్త్
  • రెండో టెస్ట్ (డిసెంబర్ 26 - డిసెంబర్ 30): మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్, మెల్బోర్న్
  • మూడో టెస్ట్ (జనవరి 03- జనవరి 07): సిడ్నీ క్రికెట్ గ్రౌండ్, సిడ్నీ