హనీ ట్రాప్లో పాక్ కెప్టెన్..వీడియో..ఆడియో లీక్

హనీ ట్రాప్లో పాక్ కెప్టెన్..వీడియో..ఆడియో లీక్

స్వదేశంలో టెస్టులు, వన్డేలు, టీ20 సిరీస్ల ఓటములతో ఇంటా బయట తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్..మరో వివాదంలో చిక్కకున్నాడు. సహచర క్రికెటర్ గర్ల్ ఫ్రెండ్తో బాబర్ ఆజమ్ సెక్స్  చాటింగ్ చేస్తున్న వీడియోలు బయటికొచ్చాయి.  ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి. బాబర్ ఆజమ్కు చెందిన ప్రైవేటు వీడియోలు, ఆడియో రికార్డింగ్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.  ' నువ్వు  నాతో ఇలాగే సెక్స్ చాటింగ్ చేస్తుంటే..నీ బాయ్ ఫ్రెండ్ టీమ్లో కొనసాగుతాడు' అంటూ తోటి క్రికెటర్ గర్ల్ ఫ్రెండ్తో బాబర్ అన్నట్లు వీడియోల్లో కనిపించింది.  ప్రస్తుతం పాక్ క్రికెట్లో ఈ వీడియోలు, ఆడియోలు సంచలనంగా మారాయి. 


గతంలోనూ...

బాబర్ ఆజమ్ పై రెండేళ్ల కిందట ఓ మహిళ లైంగిక ఆరోపణలు చేసింది. హమీజా ముఖ్తర్ అనే యువతి..బాబర్ తనను  పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఆరోపించింది. బాబర్ క్రికెట్లోకి రాకముందు కూడా తనకు తెలుసని..అతను చాలా పేద కుటుంబం నుంచి వచ్చాడని పేర్కొంది. ఆజమ్ తనకు 2010లో ప్రపోజ్ చేశాడని..ఒకరినొకరం ’అర్థం చేసుకున్నామని..తమ పెద్దలకు కూడా ప్రేమ విషయం చెప్పినట్లు తెలిపింది. అయితే ఆజమ్ కుటుంబ సభ్యులు మాత్రం ఒప్పుకోలేదని వెల్లడించింది. దీంతో కోర్టు ద్వారా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నామని..2011లో పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేశాడని చెప్పింది. కానీ ఆ తర్వాత అతను తనను మోసం చేసినట్లుగా చెప్పుకొచ్చింది. 


భిన్నాభిప్రాయాలు..

బాబర్ అజమ్ వీడియోలు, ఆడియాలపై పాకిస్థాన్‌ క్రికెట్‌ అభిమానులు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. వీడియాల్లో ఉన్నది బాబర్ కాదంటున్నారు. అతన్ని కావాలనే హనీట్రాప్లో ఇరికించారని కొందరని అభిప్రాయపడుతున్నారు.  ఒకవేళ వీడియోల్లో ఉన్నది  బాబర్‌ అజమ్‌ అయినా..అది అతని  వ్యక్తిగత జీవితం అని..వాటితో ఇతరులకేమి పని అంటూ ప్రశ్నిస్తున్నారు.  ఇందులో భాగంగా ట్విట్టర్‌లో ధైర్యంగా ఉండు, మేము మీతో ఉన్నాం అనే  అనే హ్యాష్‌ ట్యాగ్‌లు ట్రెండ్‌ అవుతున్నాయి. 


బాబర్పై చర్యలు..?

ప్రపంచ మేటి ఆటగాళ్లలో ఒకడిగా పేరొందిన బాబర్‌ ఆజమ్..గత కొద్ది కాలంగా కెప్టెన్‌గా ఫెయిల్‌ అవుతున్నాడు. స్వదేశంలో  ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్ల చేతిలో పాక్ దారుణ ఓటమి మూటగట్టుకుంది. దీంతో అతని నాయకత్వంలోపై పాక్ క్రికెట్ బోర్డు అసంతృప్తిగా ఉంది. అటు టెస్టుల్లో అతడి సారథ్యంలోనే పాకిస్థాన్  వరుసగా నాలుగు టెస్టుల్లో ఓడింది. ఈ చెత్త రికార్డును మూటగట్టుకున్న తొలి పాక్  కెప్టెన్‌ బాబర్ కావడం గమనార్హం. దీంతో పాక్ ప్రభుత్వం జోక్యం చేసుకొని పీసీబీ  అధ్యక్షుణ్ని మార్చేసింది. ఇక  మూడు ఫార్మాట్లకు వేర్వేరు కెప్లెన్లను నియమించాలనే యోచనలో పాక్ క్రికెట్ బోర్డ్ ఉంది. దీంతో బాబర్ ఆజమ్‌ను టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పించే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ హనీట్రాప్‌ ఆరోపణలు బయటపడటంతో బాబర్‌పై చర్చలు కూడా తీసుకునే అవకాశం ఉంది.