డాక్టర్ నిర్లక్ష్యం: 430మంది పిల్లలకు HIV

డాక్టర్ నిర్లక్ష్యం: 430మంది పిల్లలకు HIV

డాక్టర్ నిర్లక్షంతో 500మందికి HIV సోకింది. ఇందులో పిల్లలు 430 మంది ఉన్నారు. ఈ ఘటన పాకిస్తాన్ లోని సింధ్ ప్రావిన్స్ లో జరిగింది. గత నెల సింధ్ ప్రావిన్స్ లోని లర్కానా జిల్లాలో ఒకే సారి చాలా మంది జ్వరం, దగ్గుతో పాటు పలు అనారోగ్య కారణాలతో హాస్పిటల్ కు వెళ్లారు. వీరికి రక్త పరీక్ష నిర్వహించగా.. అందరికీ HIV పాజిటీవ్ అని తేలింది. 500మందికి గాను 430 మంది చిన్నారులకు HIV సోకిందని తేలింది. దీంతో అక్కడి అధికారులు దర్యాప్తు చేపట్టారు.

HIV సోకిన వారంతా గత నెలలో స్థానికంగా ఉన్న ముజఫర్ అనే పిల్లల డాక్టర్ దగ్గర వైధ్యం చేయించుకోడానికి వెళ్లినట్లు తెలిసింది. డాక్టర్ ను పోలీసులు విచారించగా.. HIV వైరస్ ఉన్న సూదిని పిల్లలకు వాడినట్లు తెలిసింది. దీంతో డాక్టర్ ను పోలీసులు అరెస్ట్ చేసి కేసును నమోదు చేశారు. పైగా ముజఫర్ కూడా ఎయిడ్స్ పేషెంట్ అని తేలింది.