వరల్డ్ కప్కు ముందు పాక్ బౌలర్ సంచలన నిర్ణయం.. క్రికెట్కు వీడ్కోలు

వరల్డ్ కప్కు ముందు పాక్ బౌలర్ సంచలన నిర్ణయం.. క్రికెట్కు వీడ్కోలు

పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ వహాబ్ రియాజ్ 2023 వరల్డ్ కప్ ముందుసంచలన నిర్ణయం తీసుకున్నాడు.   2023 ఆగస్టు 16 బుధవారం రోజున అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 38 ఏళ్ల వయసున్న రియాజ్ గత రెండేళ్లుగా రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తున్నట్లుగా వెల్లడించాడు.  

ఇక నుంచి ఫ్రాంచైజీ క్రికెట్‌లో తన ప్రయాణాన్ని ఫ్రారంబించనున్నట్లుగా రియాజ్ చెప్పుకొచ్చాడు. అంతర్జాతీయ వేదికపై పాకిస్థాన్‌కు ప్రాతినిధ్యం వహించడం తనకు చాలా గర్వంగా ఉందని తెలిపాడు.  

పాకిస్థాన్ తరపున రియాజ్ 27 టెస్టులు, 91 వన్డేలు, 36 టీ20లు ఆడి 237 అంతర్జాతీయ వికెట్లు తీశాడు. అతను చివరిసారిగా డిసెంబర్ 2020లో  జట్టు తరుపున ఆడాడు. రియాజ్ తరచుగా 145 kmph వేగంతో బౌలింగ్ చేస్తాడు.  

2015 ప్రపంచ కప్ లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో 154.5 kmph వేగంతో బౌలింగ్ వేశాడు.  రియాజ్ 2011, 2015, 2019 ప్రపంచకప్‌ లలో ప్రాతినిధ్యం వహించాడు.