ముగిసిన పాక్ ఇన్నింగ్స్... ఇండియా టార్గెట్ 160 రన్స్

ముగిసిన పాక్ ఇన్నింగ్స్... ఇండియా టార్గెట్ 160 రన్స్

టీ 20 వరల్ట్ కప్ లో భాగంగా మెల్‌బోర్న్‌ వేదికగా ఇండియా, పాకిస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో పాక్ నిర్ణీత 20 ఓవర్లలో  ఎనిమిది వికెట్ల నష్టానికి  159  పరుగులు చేసింది. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పాకిస్థాన్  జట్టుకు అర్ష్‌దీప్‌ రూపంలో  వరుస షాక్ లు తగిలాయి. అతని బౌలింగ్ లో  పాక్‌ కెప్టెన్‌ బాబర్ ఆజమ్ డకౌట్ కాగా, మరో ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్‌  (4)  కూడా వెంటనే వెనుదిరిగాడు.  ఆ తరువాత మరో వికెట్ పడకుండా ఇఫ్తికార్ అహ్మద్ (21), షాన్‌ మసూద్ (52  నాటౌట్ ) ఆచితూచి ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు నడపించారు.

పది ఓవర్లు ముగిసేసరికి పాక్ 60 పరుగులు చేసింది. ఆ తరువాత దూకుడుగా ఆడిన ఇఫ్తికార్ హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకుని ఆ వెంటనే మహమ్మద్ షమీ బౌలింగ్ లో ఎల్బీగా ఔట్ అయ్యాడు. ఆ తరువాత వచ్చిన బ్యాట్స్ మెన్స్ ఎక్కవ సేపు క్రీజ్ లో నిలువలేకపోయారు. దీంతో 20  ఓవర్లు ముగిసే టైమ్ కు పాకిస్థాన్  జట్టు ఎనిమిది వికెట్లు కోల్పోయి  159 పరుగులు చేసింది. భారత బౌలర్లలో హార్దిక్‌ పాండ్య 3, అర్ష్‌దీప్‌ సింగ్ 3.. షమీ, భువీ చెరో వికెట్‌ తీశారు.