పాకిస్థాన్ సెమీస్ చేరాలంటే అదొక్కటే దారి..!!!

పాకిస్థాన్ సెమీస్ చేరాలంటే అదొక్కటే దారి..!!!

పాకిస్థాన్ సెమీస్ దారులు అన్నీ ఇప్పటికే దాదాపుగా మూసుకుపోయాయి. ఇంగ్లండ్, న్యూజీలాండ్ మ్యాచ్ లో లోకల్ టీమ్ గెలవడంతో.. పాకిస్థాన్ సెమీస్ ఎంట్రీ ఆశలు వదులుకుంది. ఏదో మిరాకిల్ జరిగితే తప్ప పాకిస్థాన్ ఈ వరల్డ్ కప్ సెమీస్ రేసులోకి అడుగుపెట్టదు.

ఆ మిరాకిల్ ఏంటంటే.. బంగ్లాదేశ్ పై పాకిస్థాన్ అత్యంత భారీ తేడాతో గెలవాలి. దాదాపు 350 రన్స్ తేడాతో బంగ్లాపై విక్టరీ కొట్టాలి. అప్పుడు మాత్రమే.. నాలుగో స్థానంలో ఉన్న న్యూజీలాండ్ ను…. రన్ రేట్ మెరుగ్గా ఉన్న కారణంగా వెనక్కి నెట్టి.. పాక్ సెమీస్ లోకి అడుగుపెట్టగలుగుతుంది. ఇది సాధ్యం కావాలంటే ఏదో అద్భుతం జరగాలని అభిమానులు అంటున్నారు. అ అద్భుతం ఎలా జరగాలో కూడా వాళ్లే 2 కిటుకులు చెబుతున్నారు.

  1. ఈ అద్భుతం పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ మాత్రమే చేయగలడు అంటున్నారు. అదేంటో కింద చూడండి.

2.పాకిస్థాన్ సెమీఫైనల్ చేరుకోవాలంటే మరోదారి కూడా ఉందంటున్నారు ఇంటర్నెట్ యూజర్స్. లాహోర్ ఎయిర్ పోర్టుకు సెమీఫైనల్ అని ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ పేరు మార్చినట్టయితే… జులై 7 నాడు పాకిస్థాన్ క్రికెట్ జట్టు సెమీఫైనల్ చేరుకోవచ్చని సెటైర్లు వేస్తున్నారు.