కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వీకెండ్ వరుస సెలవులు కావడంతో తిరుమలకు పోటెత్తారు భక్తులు. ఆదివారం ( నవంబర్ 9 ) తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.. బయట శితోరణం వరకు క్యూ లైన్లో బారులు తీరారు భక్తులు.
ఈ క్రమంలో సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోంది. టైం స్లాట్ దగ్గర భక్తులకు 8 గంటలకు సమయం పడుతుండగా.. రూ. 300 ప్రత్యేక దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది.
శనివారం ( నవంబర్ 8 ) తిరుమల శ్రీవారిని 80 వేల 560 మంది భక్తులు దర్శించుకోగా వారిలో 35 వేల 195 మంది స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శనివారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.3 కోట్ల 22 లక్షలు వచ్చినట్లు తెలిపారు అధికారులు.
