
పాకిస్తాన్ తాత్కాలిక ప్రధానమంత్రిగా అన్వర్ ఉల్ హక్ కకర్ దాదాపుగా ఎన్నికైనట్లే కనిపిస్తోంది. ఆయన పేరును ఆ దేశ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ సహా విపక్షాలు కూడా అంగీకరించాయి. కాబోయే నూతన ప్రధాని అన్వర్ ఉల్ హక్.. బలూచిస్థాన్ నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ప్రధాని మంత్రి కార్యాలయం స్పష్టం చేసినట్లు ఆ దేశ మీడియా జియో న్యూస్ పేర్కొంది. నివేదిక ప్రకారం.. బలూచిస్థాన్‌కు చెందిన సెనేటర్ అన్వర్-ఉల్-హక్ కకర్‌ను తాత్కాలిక ప్రధానమంత్రిగా ఎంపిక చేసినట్లు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఒక ప్రకటన పేర్కొంది.
పదవీ విరమణ చేసిన ప్రధాని షెహబాజ్ షరీఫ్ సహా ప్రతిపక్ష నాయకుడు రాజా రియాజ్ రెండు దఫాలుగా సంప్రదింపుల తర్వాత అన్వర్ పేరును ఖరారు చేశారు. కాకర్ బలూచిస్తాన్ అవామీ పార్టీకి చెందిన నాయకుడు అన్వర్. పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీకి ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. అప్పటి వరకు అన్వర్ ఆపద్ధర్మ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తారు. ప్రస్తుత ప్రధానితో సమావేశం అనంతరం విపక్ష నాయకుడు రియాజ్ మీడియాతో మాట్లాడుతూ.. తాత్కాలిక ప్రధాని చిన్న ప్రావిన్స్‌కు చెందిన వ్యక్తిగా ఉండాలని నిర్ణయించుకున్నామని అన్నారు. కాకర్ల పేరును ఆయనే సూచించారని, దానికి తాము ఆమోదం తెలిపామని అన్నారు.