రిజ్వాన్ను ఔట్ చేసిన అర్షదీప్ సింగ్

రిజ్వాన్ను ఔట్ చేసిన అర్షదీప్ సింగ్

భారత్ పాక్ మ్యాచ్లో బౌలర్ అర్షదీప్ సింగ్ రెచ్చిపోతున్నాడు. బుల్లెట్ బంతులతో పాక్ బ్యాట్స్మన్ను వణికిస్తున్నాడు. రెండో ఓవర్లోనే కెప్టెన్ బాబర్ ఆజమ్ను ఔట్ చేసిన అర్షదీప్ సింగ్...మరో ఓపెనర్ రిజ్వాన్ను పెవీలియన్ చేర్చాడు. బౌన్సర్ ను పుల్ చేయబోయిన రిజ్వాన్..భువనేశ్వర్ కుమార్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

అంతకుముందు రెండు సార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి రిజ్వాన్ తప్పించుకున్నాడు. మొదటిసారిగా రనౌట్ అయ్యే అవకాశం నుంచి బయటపడ్డాడు. కోహ్లీ విసిరిన బంతి..కరెక్ట్గా వికెట్లను తాకకపోవడంతో..బతికిపోయాడు. నాల్గో ఓవర్లోనే అర్షదీప్ బౌలింగ్లోనే బంతిని గాల్లోకి లేపగా..కోహ్లీకి కొద్ది దూరంలో పడింది. ఆ తర్వాత బాల్నే మరోసారి గట్టిగా కొట్టేందుకు ప్రయత్నించి...ఔట్ అయ్యాడు.