చంద్రయాన్-3 విజయం: ఫ్రస్టేషన్‌లో పాకిస్తాన్ నెటిజెన్స్.. పిచ్చి పిచ్చి కామెంట్లు

చంద్రయాన్-3 విజయం: ఫ్రస్టేషన్‌లో పాకిస్తాన్ నెటిజెన్స్.. పిచ్చి పిచ్చి కామెంట్లు

చంద్రయాన్ -3 విజయంతో భారత్.. అంతరిక్ష పరిశోధనలో కొత్త అధ్యాయాన్ని లిఖించింది. చంద్రుడి దక్షిణ దృవంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసి.. ప్రపంచ దేశాలన్నింటినీ తన వైపుకు తిప్పుకుంది. ఈ విజయంతో ప్రపంచ దేశాల అగ్రనేతలు, ప్రముఖులందరూ ఇస్రో సైంటిస్టుల ప్రతిభను కొనియాడుతున్నారు. 

ఓవైపు ఇలా మన దేశ ప్రజలు ఆనందంలో ముగిపోయి సంబరాలు జరుపుకుంటే.. పాక్ అభిమానులు మాత్రం ఈ విజయాన్ని ఓర్వలేకపోతున్నారు. పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తూ తమ వక్రబుద్ధిని బయటపడుతున్నారు. వారి ట్వీట్లలో వ్యతిరేక భావజాలాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. #AdvisorZaidu అనే ఓ పాక్ అభిమాని.. "26కేజీల బరువున్న రోవర్‌ను పంపినందుకే ఇండియా సంబరపడిపోతోందని.. అదే పాకిస్తాన్ అయితే 500కేజీల పే*లుడు పదార్థాలను కూడా అలవోకగా పంపగలదు.." అని ట్వీట్ చేశారు.

మరొక ట్వీట్‌లో.. "చంద్రునిపైకి మిషన్‌ను పంపడం చాలా సులభం, ఎవరైనా దీన్ని చేయగలరు. అయితే ముజాహిదీన్‌లను ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు ముఖ్యంగా యూరప్, యుఎస్, ఇజ్రాయెల్ మరియు భారతదేశానికి పంపడమన్నది అంత సులభం కాదు. అందుకు సంవత్సరాల ప్రణాళిక, ఖచ్చితత్వంతో పాటు ఎంతో ధైర్యం అవసరం.." అని ట్వీట్ చేశారు. 

#AdvisorZaidu అనే యూజర్ స్వస్థలం పాకిస్తాన్‌లోని రావల్పిండి అని మెన్షన్ చేశారు. దాదాపు అతని ట్వీట్లన్నీ ఇదే తరహాలో ఉన్నాయి.

కాగా, భారత పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన మూన్‌ మిషన్‌ చంద్రయాన్‌-3 విజయవంతమైన సంగతి విదితమే. బుధవారం సాయంత్రం 6.04 గంటలకు ల్యాండర్‌ విక్రమ్.. చంద్రుడి దక్షిణ ధృవంపై సేఫ్ గా ల్యాండ్‌ అయ్యింది.