ఆఫ్ఘనిస్థాన్ పై విజయం దిశగా పాక్

ఆఫ్ఘనిస్థాన్ పై విజయం దిశగా పాక్

షార్జా వేదికగా జరుగుతున్న ఆసియా కప్ సూపర్-4 మ్యాచ్‌లో పాక్ విజృంభించింది. పాక్ బౌలర్లు చెలరేగడంతో ఆఫ్ఘనిస్థాన్ టీమ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 129 పరుగులే చేసింది. ఆ టీమ్‌లో ఇబ్రహీం జద్రాన్ (35) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పాకిస్థాన్ బౌలర్లలో హారిస్ రౌఫ్ రెండు వికెట్లు పడగొట్టగా.. నసీమ్ షా, మహ్మద్ హొస్నైన్, నవాజ్, షదాబ్ ఖాన్ తలో వికెట్ తీశారు.

అంతకుముందు టాస్ గెలిచిన పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దాంతో అఫ్గానిస్థాన్ ఇన్నింగ్స్‌ని ప్రారంభించిన హజ్రతుల్లా (21), గర్బాజ్ (17) తొలి వికెట్‌కి 36 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత వచ్చిన ఇబ్రహీం దూకుడుగా ఆడేసినా.. కరీమ్ (15), నజీబుల్లా (10), నబీ (0), రషీద్ ఖాన్ (18) తక్కువ స్కోరుకే ఔటైపోయారు. దాంతో అఫ్గానిస్థాన్ 129 పరుగులతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 130 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ను ప్రారంభించిన పాక్.. 13.3 ఓవర్లు ముగిసే సమయానికి 3 వికెట్లే కోల్పోయి 80 పరుగులు చేసి విజయానికి చేరువైంది.