
- అప్పుడు పాక్ అడ్డుకున్నా.. ఇప్పుడు ఇండియా పర్మిషన్
- ఇమ్రాన్‌ఖాన్ ఫ్లైట్ మన దేశంపై నుంచి వెళ్లడానికి ఓకే చెప్పిన ప్రభుత్వం
న్యూఢిల్లీ: ఇండియా మరోసారి పెద్దమనసు చాటుకుంది. శ్రీలంక టూర్‌కు వెళ్లే పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ఫ్లైట్ మన ఎయిర్‌స్పేస్‌లోంచి వెళ్లడానికి పర్మిషన్ ఇచ్చింది. ఇంటర్నేషనల్ ప్రోటోకాల్ ప్రకారం.. వీవీఐపీల విమానాలు ఇతర దేశాల ఎయిర్‌స్పేస్ నుంచి వెళ్లాలన్నా ఆ దేశ ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. అయితే, ఇండియన్ ఫ్లైట్లు తమ దేశ ఎయిర్‌స్పేస్ మీదుగా వెళ్లడాన్ని పాకిస్తాన్ గతంలో నిషేధించింది. పాక్ మీదుగా అమెరికా, సౌదీ అరేబియా వెళ్లేందుకు మన ప్రధాని మోడీ ఫ్లైట్‌కు ఆ దేశం పర్మిషన్ ఇవ్వలేదు. దీంతో మరో రూట్‌లో మోడీ ఫ్లైట్ వెళ్లింది. కాగా, ఇండియా నిర్ణయాన్ని కజకిస్తాన్, స్వీడన్, లాత్వియా మాజీ ఇండియన్ అంబాసిడర్ అశోక్ సజ్జనార్ మెచ్చుకున్నరు. పాక్ తీరుపై ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్‌కు ఇండియా అప్పట్లో కంప్లైంట్ చేసింది.
For More News..