
ఇస్లామాబాద్: అఫ్గానిస్తాన్‌కు చెందిన 19 సైనిక పోస్టులు, ఉగ్రవాద స్థావరాలను స్వాధీనం చేసుకున్నట్టు పాకిస్తాన్ భద్రతా వర్గాలు తెలిపాయి. ఆదివారం పాకిస్తాన్ మంత్రి మొహ్సిన్ నఖ్వీ మాట్లాడుతూ.. సరిహద్దుల్లో తాలిబాన్ సైనికులు పౌరులపై కాల్పులు జరిపారని ఆరోపించారు. "పౌర సమాజంపై అఫ్గాన్ దళాలు కాల్పులు జరపడం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమే. అఫ్గాన్ దాడులను మా దళాలు ప్రభావవంతంగా తిప్పికొట్టాయి. ఇకపై ఎలాంటి రెచ్చగొట్టే చర్యలను సహించబోం" అని ఆయన హెచ్చరించారు.
పాకిస్తాన్ దళాలు అప్రమత్తంగా ఉన్నాయని, అఫ్గానిస్తాన్‌కు ఇటుకలకు బదులుగా రాళ్లతో సమాధానం ఇస్తున్నామని ఆయన అన్నారు. కాగా, పాకిస్తాన్ ఆర్మీ ఆదివారం తెల్లవారుజామున తన ప్రతీకార చర్యను ప్రారంభించిందని, అనేక సరిహద్దు ప్రాంతాల్లో పోస్టులను ధ్వంసం చేసిందని రాష్ట్ర మీడియా నివేదించింది.