కాశ్మీర్‌‌ వేర్పాటువాద నేతకి అవార్డు ఇవ్వాలంటూ ప్రతిపాదించిన పాకిస్తాన్‌ సెనేట్‌

కాశ్మీర్‌‌ వేర్పాటువాద నేతకి అవార్డు ఇవ్వాలంటూ ప్రతిపాదించిన పాకిస్తాన్‌ సెనేట్‌
  • పాకిస్తాన్‌ అత్యుత్తమ అవార్దు ఇవ్వాలని రెజల్యూషన్‌

లాహోర్‌‌: కాశ్మీర్‌‌ వేర్పాటు వాద నేత, హురియత్‌ కాన్ఫరెన్స్‌ మాజీ చీఫ్‌ సయ్యద్‌ అలీ షా గిలానీకి పాకిస్తాన్‌లోనే సివిలియన్స్‌కు ఇచ్చే అత్యుత్తమ అవార్డు ‘నిశాన్‌ – ఈ – పాకిస్తానీ’ అవార్డు ఇవ్వాలని పాకిస్తాన్‌ సెనేట్‌ రెజల్యూషన్‌ పాస్‌ చేసింది. పాకిస్తాన్‌ అప్పర్‌‌ హౌస్‌లో సోమవారం ఈ రెజల్యూషన్‌ పాస్‌ చేశారని తెలుస్తోంది. అంతే కాకుండా గిలానీ లైఫ్‌స్టోరీని పాకిస్తాన్‌లోని పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని కూడా డిమాండ్‌ చేశారని తెలుస్తోంది. హురితయ్‌ సంస్థకు గిలానీ రాజీనామా ప్రకటించిన కొద్ది రోజులకే అవార్డు ఇవ్వాలని అడగటం గమనార్హం. ఏండ్లుగా హురియత్‌ చీఫ్‌గా ఉన్న గిలానీ ఈ మధ్య రిజైన్‌ చేశారు. హోం అరెస్టులో ఉన్న ఆయన ఆడియో మేసేజ్‌ ద్వారా దాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.