
లాహోర్: సౌతాఫ్రికాతో ఆదివారం మొదలైన తొలి టెస్ట్‌లో పాకిస్తాన్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. ఇమామ్ ఉల్ హక్ (93), షాన్ మసూద్ (76), మహ్మద్ రిజ్వాన్ (62 బ్యాటింగ్), సల్మాన్ ఆగా (52 బ్యాటింగ్) హాఫ్ సెంచరీలు చేయడంతో.. తొలి రోజు ఆట ముగిసే టైమ్‌కు పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 313/5 స్కోరు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పాక్‌కు ఇన్నింగ్స్ మూడో బాల్‌కే ఎదురుదెబ్బ తగిలింది. రబాడ (1/43).. అబ్దుల్లా షఫీక్ (2)ను ఎల్బీ చేశాడు.
ఈ దశలో ఇమామ్, షాన్ మసూద్ నిలకడగా ఆడి రెండో వికెట్‌కు 161 రన్స్ జోడించి ఇన్నింగ్స్‌ను కుదుటపర్చారు. అయితే 48వ ఓవర్‌లో ప్రేనేలన్ సుబ్రాయెన్ (1/72) షాన్ మసూద్‌ను పెవిలియన్‌కు పంపాడు. 57వ ఓవర్‌లో సేనురన్ ముత్తుసామి (2/101) వరుస బాల్స్‌లో ఇమామ్, సౌద్ షకీల్ (0)ను ఔట్ చేశాడు. మరో రెండు ఓవర్ల తర్వాత సిమోన్ హార్మర్ (1/75).. బాబర్ ఆజమ్ (23)ను వెనక్కి పంపాడు. ఓవరాల్‌గా 36 రన్స్ తేడాలో నాలుగు వికెట్లు పడటంతో పాక్ 199/5తో కష్టాల్లో పడింది. ఈ దశలో రిజ్వాన్, సల్మాన్ ఆరో వికెట్‌కు 114 రన్స్ జోడించి ఇన్నింగ్స్‌ను కాపాడారు.