
అహ్మదాబాద్: పాకిస్తాన్ ఆచరిస్తున్న ఉగ్రవా దం పూర్తిగా ఉద్దేశ పూర్వకమని, వాళ్ల యుద్ధ వ్యూహం అదేనని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. భారత్ ఆ వ్యూహాన్ని తిప్పి కొట్టేందుకు, గట్టిగా బదులిచ్చేందుకు ఎప్పుడూ సిద్ధం గానే ఉంటుందని ప్రధాని అన్నారు. ఇవాళ (మే 17) ఆయన గుజరాత్ లో పర్యటించారు. గాంధీ నగర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ లో హతమైన ముష్కరుల అంత్యక్రియలను పాక్ ప్రభుత్వం అధికార లాంఛనాలతో నిర్వహిం చిందని మోదీ దుయ్యబట్టారు.
ఉగ్రవాదుల శవపేటికలపై పాక్ జాతీయజెండా కప్పటం తోపాటు సైన్యం సెల్యూట్ చేసినట్లు తెలిపారు. అందువల్ల పాక్ భూభాగం నుంచి జరుగుతున్న ఉగ్రవాదుల దాడులు పక్కా పథకం ప్రకారం వ్యూహాత్మకంగా జరుగుతున్నవేనని ఆరోపించా రు. ఉగ్రవాదాన్ని ఇప్పటివరకు పరోక్షయుద్ధం అనేవారమని, మే 6 తర్వాత కాదని అర్థమైందని అన్నారు.
ALSO READ | 5వ తరం ఫైటర్ జెట్ నిర్మాణానికి రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్..
పాకిస్తాన్ లో ఉన్న 9 ఉగ్ర స్థాపరాలను గుర్తించి కేవలం 22 నిమిషాల్లో ధ్వంసం చేశామని చెప్పారు. ఈ సారి కెమెరాలు కూడా పెట్టామన్నారు. ఎందుకంటే మనవారే ఎవరైన సాక్ష్యం అడిగితే ఇవ్వటానికని చెప్పారు. ఇప్పుడు మనం సాక్ష్యాలు ఇవ్వాల్సిన అవసరం లేకుండా అక్కడివారే ఇస్తున్నారని ప్రధాని మోడీ అన్నారు.
1947లో భారత్ ను మూడు ముక్కలుగా చేశారని అన్నారు. అదే రోజు రాత్రి కశ్మీర్ పై మొదటి ఉగ్రవాద దాడి జరిగిందని చెప్పారు. ఉగ్రవాదుల సాయంతోనే కాశ్మీర్లోని కొంత భాగాన్ని పాకిస్తాన్ స్వాధీనం చేసుకుందని చెప్పారు. సర్దార్ పటేల్ సలహాలను అంగీకరించి ఆ రోజే ఉగ్రవాదలను చంపి ఉంటే భారత్ లో గత 75 ఏండ్లుగా కొనసాగుతున్న ఈ ఉగ కార్యకలాపాలు ఉండేవి కాదన్నారు.