పాకిస్థాన్‌కు అంత సీన్ లేదు.. సెమీ ఫైనల్స్‌కు కూడా రాదు : హర్భజన్ సింగ్

పాకిస్థాన్‌కు అంత సీన్ లేదు.. సెమీ ఫైనల్స్‌కు కూడా రాదు : హర్భజన్ సింగ్

2023 అక్టోబర్ 5 నుంచి భారత్‌ వేదికగా వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానుంది. అయితే  ఏ జట్టు విజేతగా నిలుస్తుంది? ఏ ఏ జట్లు సెమీస్‌కు చేరతాయనే అంశాలపై పలువురు మాజీ క్రికెటర్లు తమతమ అభిప్రాయలను వెల్లడిస్తున్నారు.  ఆస్ట్రేలియా మాజీ వికెట్‌కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ భారత్, పాకిస్థాన్‌, ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా సెమీ ఫైనల్స్‌కు వస్తాయని అంచనా వేశాడు. 

టీమిండియా మాజీ స్పి్న్నర్ హర్భజన్ సింగ్ మాత్రం  వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా ఉన్న పాకిస్థాన్‌ కు అంత సీన్ లేదని, ఆ జట్టు కనీసం మీ ఫైనల్స్‌కు కూడా రాదని చెప్పాడు.  పాక్‌ టీ20ల్లో బాగా ఆడుతోంది కానీ..  వన్డే ఫార్మాట్‌లో మాత్రం యావరేజ్ టీమ్‌ అని అభిప్రాయ పడ్డాడు.  ఈ నాలుగు జట్లు (భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్) సెమీస్‌కు వెళ్తాయని జోస్యం చెప్పాడు.  

వన్డే ప్రపంచకప్‌లో మొత్తం 10 జట్లు పోటీపడుతున్నాయి. లీగ్‌ దశలో ప్రతి జట్టు మిగిలిన తొమ్మిది జట్లతో ఒక్కో మ్యాచ్‌ ఆడుతుంది. టాప్‌-4లో నిలిచిన జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. అక్టోబర్‌ 8న భారత్ తన మొదటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది.  అక్టోబర్ 14న పాకిస్థాన్ తో ఆడుతుంది.   నవంబర్ 19న ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది.