పాకిస్తాన్ నటి సెహర్ షిన్వారి సోషల్ మీడియా అభినమానులకు పరిచయస్తురాలే. భారత క్రికెటర్లపై, భారత క్రికెట్ అభిమానులపై పడి ఏడవటం ఈ అమ్మడికి బాగానే అలవాటు. గతేడాది భారత్, జింబాబ్వే మధ్య జరిగిన మ్యాచ్‌ను ఉద్దేశిస్తూ షిన్వారి చేసిన ట్వీట్ అప్పట్లో పెద్ద రచ్చ చేసింది.
ఆ మ్యాచ్‌లో జింబాబ్వే కనుక.. ఇండియాను ఓడిస్తే, అప్పుడు ఆ దేశ వ్యక్తిని పెళ్లి చేసుకుంటానంటూ ట్వీట్ చేసింది. అయితే ఆ మ్యాచ్‌లో తాను కోరుకున్నది జరగకపోయేసరికి కొన్నాళ్ళు కనపడకుండా పోయింది. ఇప్పుడు చంద్రయాన్ -3 విజయంతో ఈ ముద్దుగుమ్మ మరోసారి సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. కాకపోతే ఈసారి రూటు మార్చి తమ సొంత దేశంపైనే సెటైర్లు వేసింది.
చంద్రయాన్-3 విజయంపై స్పందించిన సెహర్ షిన్వారీ.. భారతదేశానికి అభినందనలు తెలిపింది. అలాగే ఇస్రో సాధించిన విజయాలు.. సైన్స్ మరియు టెక్నాలజీ పరంగా పాకిస్తాన్ ఎంత వెనుకబడి ఉందో తెలియజేస్తున్నాయని అంగీకరించింది. ఈ ఘనత సాధించేందుకు పాకిస్థాన్‌కు కొన్ని దశాబ్దాలు పడుతుందని ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.
Apart from animosity with India, I would really congratulate ISRO for making history in the space research through Chandaryan3. The gap between Pakistan and India has widened to such a level in all aspects that now it will take two to three decades for Pakistan to reach there.…
— Sehar Shinwari (@SeharShinwari) August 23, 2023
This is not only India's moment, it's an historic occasion for all of South Asia. Congratulations ❤️? #Chandrayaan3 #Chandrayaan3Landing pic.twitter.com/JNM7oRXrEG
— Farid Khan (@_FaridKhan) August 23, 2023