రావల్పిండి పిచ్..ఉప్పల్ పిచ్ సేమ్ టు సేమ్.. హైదరాబాద్ అదుర్స్

రావల్పిండి పిచ్..ఉప్పల్ పిచ్ సేమ్ టు సేమ్.. హైదరాబాద్ అదుర్స్

హైదరాబాద్ వాతావరణం, ప్లేయింగ్ కండిషన్స్ పాకిస్తాన్ లో ఉన్నట్లే ఉన్నాయని పాక్ క్రికెటర్ షాదాబ్ ఖాన్ అన్నాడు. రావల్పిండి పిచ్ ఎలా ఉందో ఉప్పల్ పిచ్ కూడా అలాగే ఉందని చెప్పాడు.  హైదరాబాద్  ఆతిథ్యం బాగా నచ్చిందన్నాడు.  ఇక్కడి  ఫుడ్ చాలా రుచికరంగా ఉందని... ఈ ఫుడ్ తింటే తాము కచ్చితంగా బరువు పెరుగుతామని చెప్పాడు. ఇలాంటి ఆతిథ్యమే అహ్మదాబాద్ లోనూ ఉంటుందని తాము ఆశిస్తున్నట్లు తెలిపాడు. 

న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచులో పాక్ బౌలింగ్ అంత మెరుగ్గా లేదన్నాడు షాదాబ్ ఖాన్. పాకిస్తాన్ బౌలింగ్ ఇంకా మెరుగుపడాల్సి ఉందని చెప్పాడు. న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచులో భారీగా పరుగులివ్వడం జట్టును ఆందోళనకు గురిచేస్తోందన్నాడు. అయితే రాబోయే రోజుల్లో అద్భుత ప్రదర్శన ఇస్తామని దీమా వ్యక్తం చేశాడు. పాకిస్తాన్ జట్టులో ఫకర్ జమాన్ ఇంపాక్ట్ ప్లేయర్ అని అన్నాడు షాదాబ్ ఖాన్. కానీ ఇప్పుడు అతను టీమ్ లో లేడని..త్వరలో వస్తాడన్న నమ్మకం ఉందన్నాడు. 

Also Read :- ఆసియా క్రీడల్లో భారత్ కి దూకుడు.. స్టెప్లెచేస్‌లో అవినాష్‌ సాబుల్‌ గోల్డ్ మెడల్

టీమిండియాలో రోహిత్ శర్మ తనకు ఇష్టమైన బ్యాటర్ అన్నాడు షాదాబ్ ఖాన్. అతను ఫాంలో ఉన్నాడంటే అడ్డుకోవడం కష్టమని చెప్పాడు. ప్రస్తుతం టీమిండియాలో కుల్దీప్ యాదవ్ మంచి ఫాంలో ఉన్నాడని తెలిపాడు. ఓ స్పిన్నర్ ఫ్లాట్ ట్రాక్ మీద బౌలింగ్ వేయడం కష్టమైనదన్నాడు. కానీ కుల్దీప్ అద్భుతంగా రాణిస్తున్నాడని ప్రశంసించాడు. ఈ వరల్డ్ కప్ సాధించాలంటే భారత్కు బౌలింగే కీలకం కానుంది.