ఆసియా క్రీడల్లో భారత్ కి దూకుడు.. స్టెప్లెచేస్‌లో అవినాష్‌ సాబుల్‌ గోల్డ్ మెడల్

ఆసియా క్రీడల్లో భారత్ కి దూకుడు.. స్టెప్లెచేస్‌లో అవినాష్‌ సాబుల్‌ గోల్డ్ మెడల్

ఏషియన్ గేమ్స్ 2023 పోటీల్లో భారత అథ్లెట్లు అదరగొడుతున్నారు. పతకాల పంట పండిస్తూ పాయింట్ల పట్టికలో దూసుకెళ్తున్నారు. ఇప్పటికే భారత షూటర్లు ఏకంగా 22 మెడల్స్‌తో అదరగొడితే.. తాజాగా  3 వేల మీటర్ల స్టెప్లెచేస్‌ ఈవెంట్‌లో భారత అథ్లెట్ అవినాష్ సాబుల్ గోల్డ్ మెడల్ గెలిచాడు. 3 వేల మీటర్ల స్టెప్లెచేస్‌ ఈవెంట్‌లో స్వర్ణం గెలిచిన మొట్టమొదటి భారత పురుష అథ్లెట్‌గా సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు అవినాష్. 

అవినాష్ తన లక్షాన్ని చేరుకోవడానికి కేవలం 8:19.50 సెకన్ల సమయం మాత్రమే అవసరమైంది. గత ఏడాది జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో రజతం గెలిచిన అవినాష్ సాబుల్, ఈ సారి తన కళను సాకారం చేసుకొని గోల్డ్ తో మెరిశాడు. మరోవైపు పురుషుల షాట్‌పుట్‌లో (20.36) తజిందర్‌పాల్ సింగ్ భారత్‌కు స్వర్ణం అందించాడు.

Also Read :- ఇండియాలో ఆ రెండు నగరాల ముస్లింల సపోర్ట్ మాకే