భారత్ కి ధీటుగా పాక్ ఫ్యాన్స్ సంబరాలు..అసలు విషయం ఏమిటంటే..?

భారత్ కి ధీటుగా పాక్ ఫ్యాన్స్ సంబరాలు..అసలు విషయం ఏమిటంటే..?

ఆసియా కప్ లో టీమిండియా విజయం సాధించిందో లేదో మరోవైపు పాక్ సంబరాలు అంబరాన్నంటాయి. అదేంటి.. భారత్ గెలిస్తే పాక్ సంబరాలు చేసుకోవడమేంటి..? అనుకుంటున్నారా.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం అయితే భారత్ గెలుపును పాక్ సెలబ్రేట్ చేసుకోవడం లేదు. ఇండియా కన్నా మేమే గ్రేట్ అని సెలబ్రేట్ చేసుకుంటుంది. ఇంతకీ పాక్ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంది.

నెంబర్ వన్ జట్టుగా పాకిస్థాన్

తాజా ICC వన్డే ర్యాంకింగ్స్ లో పాకిస్థాన్ నెంబర్ వన్ స్థానానికి చేరుకుంది. ఆసియా కప్ గెలిచింది టీమిండియానే అయినా నెంబర్ వన్ కిరీటం మాత్రం పాక్ ఎగరేసుకుపోంది. ఆసియా కప్ గెలవడం ద్వారా భారత్ రెండో స్థానంతో సరిపెట్టుకుంది. ఆసియా కప్ ప్రారంభ సమయంలో నెంబర్ వన్ స్థానంలో నిలిచిన పాక్.. ఆ తర్వాత ఆస్ట్రేలియాకి నెంబర్ వన్ స్థానాన్ని కోల్పోయింది. కానీ ఆస్ట్రేలియా తమ చివరి మూడు వన్డేలు దక్షిణాఫ్రికా మీద ఓడిపోవడం, టీమిండియా సూపర్-4 లో బంగ్లాదేశ్ పై పరాజయం పాక్ ని మళ్ళీ నెంబర్ వన్ గా నిలబెట్టాయి. 

ALSO READ: వరల్డ్ కప్ కి ఇంగ్లాండ్ జట్టు.. స్టార్ ఆటగాడికి నో ఛాన్స్

ఆసియా  కప్ భారత్ గెలవడం తట్టుకోలేని పాక్ ఫ్యాన్స్.. మేము నెంబర్ జట్టు అని సెలబ్రేట్ చేసుకుంటూ కనిపించారు. ఇదెక్కడి విడ్డూరమో తెలియదు గాని ఆసియా కప్ కనీసం ఫైనల్ కి చేరుకొని తమ జట్టుని ఆకాశానికెత్తేస్తున్నారు. మరి పాక్ వింత చేష్టల్లో ఎప్పుడు మార్పు వస్తుందో చూడాలి.