అందని భారత్ పౌరసత్వం.. వెనక్కి పోతున్న పాక్ హిందూ శరణార్థులు

అందని భారత్ పౌరసత్వం.. వెనక్కి పోతున్న పాక్ హిందూ శరణార్థులు

జైసల్మేర్‌‌‌‌‌‌‌‌: పాకిస్తాన్‌‌‌‌లో తమపై జరుగుతున్న దారుణాలను తట్టుకోలేక ఇండియాకు శరణార్థులుగా వస్తున్న హిందువులకు ఇక్కడ పౌరసత్వం దొరకడంలేదు. కఠినమైన రూల్స్‌‌‌‌, డబ్బు సమస్యే ఇందుకు కారణం. దీంతో గత ఏడాదిన్నరలో 1,500 మంది హిందువులు మళ్లీ పాకిస్తాన్‌‌‌‌కే వెళ్లిపోయారు. ‘‘2022 జనవరి నుంచి జులై దాకా 334 మంది పాకిస్తానీ హిందూ రెఫ్యూజీలు తిరిగి పాకిస్తాన్‌‌‌‌కే పోయారు. 2021 ప్రారంభం నుంచి ఇప్పటిదాకా 1,500 మంది ఇట్లనే వెనక్కి వెళ్లారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అలసత్వం కారణంగా పాక్ నుంచి వచ్చిన హిందువుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. సిటిజన్‌‌‌‌షిప్ పొందేందుకు సంబంధించి అవసరమైన డబ్బు, వనరులు చాలా మంది దగ్గర లేవు. 25 వేల మందికి పైగా పాక్ హిందువులు పౌరసత్వం కోసం ఎదురుచూస్తున్నారు. వీళ్లు 10 నుంచి 15 ఏండ్లుగా ఇక్కడే ఉంటున్నారు” అని సిమత్ లోక్ సంఘటన్  ప్రెసిడెంట్ హిందూ సింగ్ సోధా చెప్పారు.